రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం | Sakshi
Sakshi News home page

రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం

Published Mon, Sep 18 2023 3:39 AM

 Congress Working Committee to the people of Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయని.. రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దుకో­వాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) పేర్కొంది. కాంగ్రెస్‌ అబద్ధాలు చెప్పదని, శుష్క వాగ్దానాలు ఇవ్వదని.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కర్ణాటక ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చామని గుర్తు చేసింది. దశాబ్దాల తమ నిబద్ధత, ట్రాక్‌ రికార్డు ఏమిటో తెలంగాణ ప్రజానీకానికి తెలుసని.. రానున్న అసెంబ్లీ, పార్ల­మెం­టు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేయాలని తెలంగాణ ప్రజలకు సీడబ్ల్యూసీ విజ్ఞప్తి చేసింది.

సీడబ్ల్యూసీ విజ్ఞప్తిలో ఏముందంటే..?
‘‘ఇక్కడి ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం 2014లో తెలంగాణ ఏర్పాటుతో విజయవంతమైంది. అందులో కాంగ్రెస్‌ పార్టీ కీలక పాత్ర పోషించింది. యూపీఏ చైర్‌పర్సన్  సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్  అన్ని రాజకీయ అవరోధాలను అధి గమించి, అందరితో చర్చించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. ప్రత్యేక రాష్ట్రంలోని వన రులు, నీళ్లు, ఉపాధి ప్రజలందరికీ లభిస్తాయ­ని, నీ ళ్లు–నిధులు–నియామకాలతో భవిష్యత్తు ఉంటుం దని, బంగారు తెలంగాణ ఏర్పడుతుందని అంతా కోరుకున్నారు.

కానీ అక్కడ ఢిల్లీలో, ఇక్కడ హైదరా బాద్‌లో ఉన్న ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశా యి. ఏ కలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలని ప్ర జలు పోరాడారో తొమ్మిదేళ్లయినా ఆ కల నెరవేర లేదు. రాష్ట్రంలో ప్రజలకు చెందాల్సిన వనరులన్నింటినీ అధికారంలో ఉన్నవారే అనుభవిస్తున్నారు. నిజాం తరహా పాలనలోకి రాష్ట్రాన్ని నెట్టారు.

రాహుల్‌ యాత్రలో వాస్తవాలు తెలిశాయి
భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ తెలంగాణలోని 8 జిల్లాల మీదుగా 405 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టినప్పుడు వేలాది మంది ప్రజలు ఆయన్ను కలిశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు పేద, రైతు, ద ళిత, ఆదివాసీ, ఆదివాసీల ప్రయోజనాలను పణం గా పెట్టి.. తమ వారికే ఎలా లబ్ధి కలిగిస్తున్నాయో తేలింది. తెలంగాణలో రైతాంగం నానాటికీ అప్పు ల్లో కూరుకుపోతున్నారు.

ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు, ఓబీసీలకు ఇందిరాగాంధీ హయాంలో పంపిణీ చేసిన భూములను ధరణి పోర్టల్‌ పేరుతో లాగేసుకుంటున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీలకు ఆ భూములను కట్టబెడుతున్నారు. కాళేశ్వ రం వంటి ప్రాజెక్టులు బీఆర్‌ఎస్‌ అనుబంధ కాంట్రాక్టర్లకు ఆదాయ వనరుగా మారాయి. మరోవైపు పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలను మోదీ ప్రభుత్వం కనీసం కనికరం లేకుండా ప్రైవేటైజేషన్  చేస్తుండటంతో దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు లభించడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే బలమైన, బహుళ ప్రయోజనకారి అయిన ఆర్థిక వ్యవస్థ కోసం మొదటి నుంచీ పోరాడుతోంది.

ఆకాంక్షలను నెరవేర్చుకుందాం..
తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలను ఇప్పటికైనా నెరవేర్చుకునే దిశలో తెలంగాణ ప్రజల పోరాటానికి సీడబ్ల్యూసీ తోడుగా నిలుస్తుంది. భూములపై హక్కులు కల్పించడం, ప్రైవేటు సెక్టార్‌ను ప్రోత్సహిస్తూనే.. బలమైన ప్రభుత్వ రంగ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, ఉపాధి హామీ పేదలకు అండగా నిలవడంతోపాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి కాంగ్రెస్‌ నిబద్ధత ఏమిటో చెప్తున్నాయి. ప్రజలకు మా ట్రాక్‌ రికార్డు తెలుసు. కాంగ్రెస్‌ పార్టీ అబద్ధాలు చెప్పదు. శుష్క వాగ్దానాలు ఇవ్వదు. కర్ణాటక ప్రజలకిచ్చిన హామీలను 100 రోజుల్లో నెరవేర్చిన అక్కడి ప్రభుత్వ పనితీరు దీనిని తెలియజేస్తోంది.

తెలంగాణలో కూడా చరిత్ర సృష్టించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వరంగల్‌ వేదికగా రైతులు, హైదరాబాద్‌లో యువకులు, ఖమ్మంలో వృద్ధులకు ఇచ్చిన హామీలతోపాటు ఆరు గ్యారంటీలను ప్రజలకు ఇస్తున్నాం. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాలని కోరుతున్నాం. బంగారు తెలంగాణ స్వప్నాన్ని మరోమారు గుర్తుచేసుకుంటూ.. రాష్ట్ర ప్రజలు భవిష్యత్తును తీర్చిదిద్దుకునే సమయం ఆసన్నమైంది’’ అని సీడబ్ల్యూసీ పేర్కొంది. 

Advertisement
Advertisement