మార్చి 31న 11 గంటలకు డప్పులు కొడుతూ బెల్స్‌ మోగించండి..

Congress To Protest Price Rise With Three Phase Campaign - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడి తర్వాత వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రతీరోజు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్‌ తీరును ఎండగడుతూ కాంగ్రెస్‌ పార్టీ వినూత్న నిరసనలకు పిలుపునిచ్చింది.

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ధరలు, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్‌ పార్టీ పోరుకు రెడీ అ‍య్యింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 7 వరకు దశల వారీగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా పెరుగుతున్న ధరలకు నిరసనగా.. మార్చి 31వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రజలందరూ తమ ఇళ్లు ముందు, బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్‌ సిలిండర్లు ముందు పెట్టుకొని, డప్పులు కొడుతూ బెల్స్‌ మోగించాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సూర్జేవాలా మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం గత రెండేళ్లలో లీటరు పెట్రోల్‌ ధర రూ.29లు, డీజిల్‌ ధర రూ.28.58లు పెంచారని స్సష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఐదు రోజుల్లోనే లీటరు పెట్రోల్‌పై రూ.3.20 పెంచారని మండిపడ్డారు. మరోవైపు.. ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్‌ డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని 531శాతం, పెట్రోల్‌పై 203 శాతం పెంచినట్టు ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top