బీజేపీని ముక్కలు–ముక్కలు చేస్తాను | Congress Only Option to Fight BJP: Kanhaiya Kumar | Sakshi
Sakshi News home page

బీజేపీని ముక్కలు–ముక్కలు చేస్తాను

Oct 2 2021 7:28 AM | Updated on Oct 2 2021 7:28 AM

Congress Only Option to Fight BJP: Kanhaiya Kumar - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కన్హయ్య కుమార్‌ బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ తనను ముక్కలు–ముక్కలు (తుక్డే) గ్యాంగ్‌ అని పిలుస్తుందని, ఎందుకంటే తాను బీజేపీని తుక్డే–తుక్డే చేయగలనని వారికి తెలుసని బీజేపీ నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ వారి దృష్టిలో జాతి పిత గాంధీ కాదని, గాడ్సే అని విమర్శించారు. కేవలం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ముందు మాత్రమే వారు గాంధీని పొగుడుతారని ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశానని కేసులు పెట్టారని, కానీ ఇప్పటి వరకూ కోర్టులో అది రుజువు కాలేదన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు ‘నాథూరాం–బనాయి జోడి’ అని పేరు పెట్టారు.

 చదవండి: (అమరీందర్‌ నిబద్ధతపై సందేహం: రావత్‌)

దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీయే ఇప్పుడు తిరిగి స్వాతంత్య్రాన్ని తిరిగి కాపాడాలని అందరు యువతలాగే తాను కోరుకుంటున్నానని కాంగ్రెస్‌ను ఉద్దేశించి అన్నారు. బీజేపీలో చేరేవారంతా వారి రాజకీయ భవిష్యత్తును చూసుకుంటున్నారన్నారు. దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్‌ తప్ప బీజేపీతో పోరాడే జాతీయ పార్టీ ఏదీ లేదని చెప్పారు. బీజేపీ తప్పక ఓడిపోతుందని, ఆలా ఓడిపోతుందని నమ్మకపోయి ఉంటే పోరాడకపోయి ఉండేవాన్నని అన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నిజాయితీపరుడని కన్హయ్య కుమార్‌ వ్యాఖ్యానించారు. ఆయన్ను కలిసినప్పుడల్లా అమ్మ ఎలా ఉందని, నాన్న ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతారని చెప్పారు. రాహుల్‌ జాలి కలిగిన నేత అని చెప్పారు. తనలోని ఆ లక్షణాలను తనకెంతో నచ్చాయని చెప్పారు. ఆయన చేసే పోరాటంలో నిబద్ధత ఉందని, సత్యం బయటకు తేవడం కోసం భయపడకుండా పోరాడే వ్యక్తి అని కొనియాడారు.  

 చదవండి: (అన్న ఐపీఎస్, తమ్ముడు ఐఏఎస్‌ !) 

Advertisement
 
Advertisement
Advertisement