ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది: పొన్నాల  | Sakshi
Sakshi News home page

ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది: పొన్నాల 

Published Thu, Dec 8 2022 2:42 AM

Congress Leader Ponnala Lakshmaiah Sensational Comments On Telangana CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలు, రాజకీయా ల కోసమే ప్రజలను మభ్యపెట్టే సీఎం కేసీఆర్‌పై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ య్య జోస్యం చెప్పా రు. ఎన్నికల సమయంలోనే సీఎంకు పవర్‌ప్లాంట్లు, మెట్రో రైలు గుర్తుకు వస్తాయన్నారు.

తాను అధికారంలోకి వచ్చాక ఎలాంటి కారణం లేకపోయినా మూడేళ్ల పాటు మెట్రో పనులను ఆపేసిన కేసీఆర్‌ ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో మళ్లీ ఎయిర్‌పోర్టు, హయత్‌నగర్‌లకు మెట్రో ఏర్పాటు ప్రతిపాదనలు తీసు కొచ్చారని పొన్నాల ఆరోపించారు. బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కొత్తగా సింగరేణి పరిధిలో విద్యుత్‌ప్లాంటు ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదన కూడా ఎన్నికల కోసమేనని చెప్పారు.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement