TS: బీజేపీ కార్యకర్తల్లో కొత్త కన్‌ఫ్యూజన్‌.. రంగంలోకి హైకమాండ్‌

Confusion Among Telangana BJP Workers Over Party Chief Change - Sakshi

సాక్షి, ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి షాకిచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అలర్ట్‌ అయ్యింది. పలు అంశాలపై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌తో పాటుగా తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే నేడు ఐదు రాష్ట్రాల ఎస్సీ మోర్చా నేతలతో బీజేపీ కీలక నేతలు సమావేశం కానున్నారు. ఇక, తెలంగాణ నుంచి కూడా మోర్చా నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా నేతలు నివేదికను సమర్పించనున్నారు. 

ఇదిలా ఉండగా.. తెలంగాణలో బీజేపీలో కన్‌ఫ్యూజన్‌ను పార్టీ హైకమాండ్‌ గుర్తించింది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా ట్రాప్‌లో పడొద్దని పార్టీ అధిష్టానం సూచించింది. మరోవైపు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కొనసాగుతారని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఈ సందర్బంగా ప్రత్యర్థి పార్టీ నేతలే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఇక, కర్ణాటక ఎన్నికల తర్వాత ఫుల్‌ క్లారిటీ వచ్చేసిందంటున్న టీబీజేపీ నేతలు చెబుతున్నారు. జూన్‌ నెలలో తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డాలతో భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపే అభ్యర్థులను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు.  

ఇది కూడా చదవండి: ఇక వందే భారత్‌ స్లీపర్‌

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top