చిల్లర పెంకులకు ఆశపడి టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారు

Communists are red Roses BJP Bandi Sanjay - Sakshi

21న అమిత్‌షా సభను విజయవంతం చేద్దాం    

బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో బండి సంజయ్‌ వ్యాఖ్యలు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: కమ్యూనిస్టు పార్టీ నేతలు ‘ఎర్ర గులాబీలు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిల్లర పెంకులకు ఆశపడి టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. అలాగే కాంగ్రెస్‌ మునిగిపోయే నావ అని.. ఆ పార్టీ నేతలు బహిరంగంగానే కొట్లాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో కలిసే పోటీ చేయడానికి అవగాహన కుదుర్చుకు న్నాయని ఆరోపించారు. ఈ నెల 21న మునుగోడులో జరగబోయే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభను విజయవంతం చేయా లని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

బుధవారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలతో బండి సంజయ్‌ సమావేశమయ్యారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కిష్టాగూడెం వద్ద ప్రజా సంగ్రామ యాత్ర లంచ్‌ శిబిరంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్‌.ఇంద్రసేనా రెడ్డి, జితేందర్‌రెడ్డి, జి.వివేక్, కొండా విశ్వే శ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్, జి.ప్రేమేందర్‌ రెడ్డి, బంగారు శ్రుతి, మనోహర్‌ రెడ్డి, దాసోజు శ్రవణ్‌ పాల్గొన్నారు. 

‘మునుగోడు’ సెమీఫైనల్‌
మునుగోడు ఉప ఎన్నిక 2023లో తెలంగాణ లో జరిగే ఎన్నికలకు సెమీఫైనల్స్‌ వంటిదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని బహిరంగసభను విజయవంతం చేయడానికి నడుం బిగించాలని సంజయ్‌ పిలుపునిచ్చారు. 
వెయ్యి కిలోమీటర్ల పైలాన్‌ ఆవిష్కరణ
లింగాలఘణపురం మండలం అప్పిరెడ్డిపల్లి సమీపంలో సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర వెయ్యి కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా పైలాన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మొక్కను నాటారు.
చవదండి: చిచ్చుపెట్టే వారితో జాగ్రత్త! మోసపోతే గోసే..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top