ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్ట్‌ ప్రారంభం: మంత్రి ఉత్తమ్‌ | CM Revanth Reddy Will Launch Seetharama Project On August 15 | Sakshi
Sakshi News home page

ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్ట్‌ ప్రారంభం: మంత్రి ఉత్తమ్‌

Aug 7 2024 9:22 PM | Updated on Aug 7 2024 9:22 PM

CM Revanth Reddy Will Launch Seetharama Project On August 15

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీన అంటే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష​ం చేశారు.

కాగా, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బుధవారం సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్‌సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 15వ తేదీన సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు వైరాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement