రేవంత్‌ Vs కేటీఆర్‌: ‘సీఎం ఏం చదివారో నాకు తెలియదు’ | CM Revanth And KTR Comments In Telangana Assembly | Sakshi
Sakshi News home page

రేవంత్‌ Vs కేటీఆర్‌: ‘సీఎం ఏం చదివారో నాకు తెలియదు’

Jul 31 2024 12:35 PM | Updated on Jul 31 2024 1:06 PM

CM Revanth And KTR Comments In Telangana Assembly

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కేటీఆర్‌కు అనుకోకుండా పదవి వచ్చిందన్నారు రేవంత్‌.. ఆయనకు వ్యాఖ్యలకు కేటీఆర్‌ సమాధానమిస్తూ నేను కష్టపడ్డాను, ఉద్యోగం చేశాను. ప్రజల మధ్యలో ఉన్నాను అంటూ కామెంట్స్‌ చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ చదివారో.. ఆయన గతమెంటో బయట వేరే మాట్లాడుకుంటున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్‌ కామెంట్స్‌..

  • చీల్చి చెండాడుతా అని కేసీఆర్ అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నా

  • కేటీఆర్‌కి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌లకు పోలిక ఉంది

  • కేటీఆర్ వంద పర్సెంట్ ఆర్టిఫీషియల్, సున్న పర్సెంట్ ఇంటిలిజెన్స్

  • కేటీఆర్‌కి ఓపిక, సహనం ఉండాలి

  • కేటీఆర్‌కు అనుకోకుండా పదవి వచ్చింది

  • సూచనల రూపంలో మోసాన్ని ప్రజల మెదళ్లలో కుక్కే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు

  • పది నెలలు నిండని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారు

  • కేటీఆర్‌ సూచనల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

  • పదేళ్ల పాలన చేసిన వారు పదినెలలు పూర్తి చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

  • టూరిజం హబ్‌ క్రియేట్‌ చేస్తామంటున్నాం.

  • బతుకమ్మ చీరల డబ్బులు బకాయి పెడితే మేం చెల్లించాం.

  • బతుకమ్మ చీరల కాంట్రాక్ట్‌ బినామీలకు అప్పగించారు.

  • సూరత్‌ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్‌ కొట్టేశారు.

  • బతుకమ్మ చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేశారా? సూరత్ నుండి తెచ్చారా?

  • దీనివెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందిరికీ తెలియాలి.

  • మేము ఎప్పుడూ మీలాగా పాతబస్తీని ఇస్తాంబుల్‌ చేస్తామని చెప్పలేదు.

  • ఎంఎంటీఎస్‌ను విమానాశ్రయం వరకు వేస్తామంటే అనుమతి ఎందుకివ్వలేదు.

  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం.

  • హుస్సేన్‌సాగర్‌ నీళ్లను కొబ్బరినీళ్లలాగా మార్చుతామనలేదు.

  • ఓల్డ్‌ సిటీని ఇస్తాంబుల్‌, కరీంనగర్‌ న్యూయార్క్‌ చేస్తామన్నారు.

  • గతంలో కేసీఆర్‌ చెప్పినట్టు మేము చెప్పలేదు.

  • ఎంఎంటీస్‌ పనులు చేపట్టకపోవడం వెనుక కుట్ర ఉంది.

  • ముచ్చర్ల భూసేకరణపై కేటీఆర్‌ రెచ్చగొడుతున్నారు.

  • అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంలను నిర్మిస్తాం.

  • సిరాజ్‌, నిఖత్‌ జరీన్‌కు గ్రూప్‌-1 జాబ్‌ ఇవ్వాలని నిర్ణయించాం.

  • నిఖత్‌ జరీన్‌కు ఉద్యోగం ఇస్తానని జాబ్‌ ఇవ్వలేదు.

  • నేత కార్మికులకు పని కల్పించామని అబద్ధాలు చెప్పారు.

  • పాలసీలు మార్చింది గత ప్రభుత్వమే.

  • ముచ్చర్లలో గొప్ప నగరం నిర్మిస్తాం.

  • పది నెలలు నిండని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారు

  • మహేశ్వరంలో భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇప్పటికే వచ్చాయి.

  • ఆజామాబాద్‌లో రేపు ఇన్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన ప్రారంభమవుతుంది.

  • హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు చేస్తామని అన్నాము.

  • తాగుబోతులకు అడ్డాగా ఉన్న స్టేడియంలో మారుతున్నాయి.

  • అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్

  • ధరణిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకురాబోతుంది.

  • కేటీఆర్ రెండు గంటలు మాట్లాడి రాజకీయ కోణంలో విషం చిమ్ముతున్నారు.

  • గత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజలకు ఉపయోగపడే పాలసీలను కొనసాగిస్తాం.

  • పదేళ్లు పాలించారు కాబట్టి తెలంగాణపై ఒక అభిప్రాయం ఉంటుంది.

     


     

కేటీఆర్‌ కౌంటర్‌..

  • పాలసీలు తెస్తాము అంటుంది.. కానీ, కేసీఆర్‌పై ఝలసీ పాలసీ తప్ప ఏమీ కనిపించడం లేదు.

  • నా ఇంటలిజెన్స్ ఏంటో ప్రజలకు తెలుసు.

  • నేను చదువుకున్నాను. పోటీ పరీక్షలు రాశాను.

  • హైదరాబాద్‌, గుంటూరులో చదువుకున్నా.

  • విదేశాల్లో కూడా చదివాను.

  • ఉద్యోగం కూడా చేశాను

  • అమెరికాలో ఉద్యోగం చేసిన అదే ఉద్యోగం పేరుతో హైదరాబాద్ వచ్చాను.

  • ముఖ్యమంత్రి ఎక్కడ చదివారో.. ఆయన గతమెంటో బయట వేరే మాట్లాడుకుంటున్నారు.

  • ఆయన చదువు గురించి నాకు తెలియదు.

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 17 సంవత్సరాలుగా నాకు తెలుసు.

  • పదిహేళ్లుగా కొంత చెడింది అంతే తప్ప నాకు మంచి మిత్రుడు.

  • సౌత్ తెలంగాణ అభివృద్ధి జరిగితే సంతోషం.

  • ప్రోటోకాల్ పాటిస్తే ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటాము.

  • రాష్ట్రంలో పొలిటికల్‌ దాడులు జరుగుతున్నాయి.

  • సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే దాడి చేస్తున్నారు.

  • దావోస్‌కు వెళ్తున్న సీఎం రేవంత్‌కు అభినందనలు.

  • పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాను.

  • బోగస్‌ పెట్టుబడులను నమ్మకూడదని సూచిస్తున్నాను.

  • అదానీని రాహుల్‌ వ్యతిరేకిస్తుంటే రేవంత్‌ వెల్‌కమ్‌ చెబుతున్నారు. 


రేవంత్ కౌంటర్‌..

  • నేను ప్రభుత్వ స్కూళ్లలో మా జిల్లా, హైదరాబాదులోనే చదువుకున్నాను.

  • గుంటూరు పోలేదు అక్కడ చదువుకోలేదు.

  • నేను ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు కూడా అర్హుడేని. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement