
సాక్షి,చిత్తూరు జిల్లా : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు తాము పెట్టిన నిబంధనలను ఉల్లంఘించి జనసమీకరణ చేస్తే చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ హెచ్చరికలు జారీ చేశారు.
వైఎస్ జగన్ బుధవారం (జులై9) బంగారుపాళ్యంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్ జగన్ టూర్‌కు జనసమీకరణ చేస్తే కఠిన చర్యలు తప్పవు. మాజీ సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు 375 మందికి నోటీసులు ఇచ్చాం. ఇది కేవలం రైతులతో ముఖాముఖీ కార్యక్రమం మాత్రమే.
రైతుల పరిచయ కార్యక్రమానికి 500 మందిని, హెలిపాడ్ వద్దకు 30 మందికి మాత్రమే అనుమతిస్తున్నాం. ఈ పరిధి దాటితే నిర్వాహకులు ఎవరు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.