సాక్షి, గుంటూరు: మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతో కూటమి సర్కార్ బండారం బట్టబయలైంది. లిక్కర్ సిండికేట్లకే మద్యం షాపులు కేటాయింపునకు చంద్రబాబు ముందే నిర్ణయించినట్లు తేటతెల్లమైంది. ప్రైవేటు వ్యక్తులకే షాపులంటూ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
ప్రైవేటు షాపులే వస్తాయి..ప్రైవేటు వాళ్లకే ఇస్తామంటూ మద్యం షాపుల సిబ్బందితో కొల్లు రవీంద్ర చెప్పారు. నిర్ణయం తీసేసుకుని సబ్ కమిటీ ఏర్పాటు అంటూ చంద్రబాబు ప్రభుత్వం డ్రామాకు తెరతీస్తూ.. ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది.
మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్ , సత్యకుమార్, గొట్టిపాటి రవితో కమిటీ ఏర్పాటైంది.
ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేలా ఉప సంఘం నివేదిక ఇవ్వనుంది. మళ్లీ పాత పద్దతిలో ఇష్టా రీతిన అమ్ముకునేందుకు చంద్రబాబు సర్కార్ రెడ్ కార్పెట్ సిద్ధం చేసింది. టీడీపీ నేతలకు, లిక్కర్ సిండికేట్లకు షాపులు ఇచ్చేందుకు స్కెచ్ రెడీ వేసింది.
Comments
Please login to add a commentAdd a comment