
న్యూఢిల్లీ: బీజేపీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాకి కేంద్ర కేబినెట్ బెర్త్ ఖరారైనట్లు సమాచారం. జ్యోతిరాదిత్యతో పాటు అప్నాదళ్ నేత అనుప్రియ పటేల్, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణరాణెకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకుంటున్నారు.
ఇక వీరితో పాటు సునీత దగ్గల్, బీఎల్ వర్మ, భూపేంద్ర యాదవ్, అనురాగ్ ఠాకూర్, మీనాక్షి లేఖి, అజయ్ భట్, శోభా కర్లందాజే, ప్రీతం ముండే, శంతను ఠాకూర్, కపిల్ పటేల్ సైతం ప్రస్తుతం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌కు పయనమవుతున్నారు.
ముగ్గురు సహాయమంత్రులకు ప్రమోషన్?
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వతంత్ర హోదాతో శాఖ బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర వ్యవసాయ, పంచాయతీరాజ్ సహాయమంత్రి పురుషోత్తం రూపాలకు ప్రమోషన్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.