యూపీలో 'బై బై మోదీ' హోర్డింగ్.. అది టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల పనేనా?

ByeByeModi Hoarding in Utter Pradesh Prayagraj TRS Hand Suspected - Sakshi

లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన క్రమంలో 'చాలు మోదీ, చంపకు మోదీ' అంటూ పలు చోట్ల బ్యానర్లు, హోర్డింగ్‌లు వెలిసిన సంగతి తెలిసిందే. అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్‌ ఏర్పాటు చేయటం కలకలం రేపింది. యూపీ ప్రయాగ్‌ రాజ్‌ నగరం, బెలి రోడ్‌లోని రిజర్వ్‌ పోలీస్‌ లైన్‌కు సమీపంలో శనివారం 'బై బై మోదీ' అంటూ హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన కోలోనెల్‌గంజ్‌ పోలీసులు ప్రింటింగ్‌ ప్రెస్‌ ఓనర్‌, కార్యక్రమ నిర్వహకుడు సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) మద్దతుదారు అది ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. 

అరెస్టయిన వారిలో ప్రింటింగ్‌ ప్రెస్‌ ఓనర్‌ అభేయ్‌ కుమార్‌ సింగ్‌, కార్యక్రమ నిర్వహకుడు అనికేత్‌ కేసరి, కాంట్రాక్టర్‌ రాజేశ్‌ కేసర్వాని, కార్మికులు శివ, నంక అలియాస్‌ ధర్మేంద్రలుగా గుర్తించారు. కోలేనెల్‌గంజ్‌ డిప్యూటీ ఎస్‌పీ అజీత్‌ సింగ్‌ చౌహాన్‌ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ' ప్రధాని మోదీపై వివాదాస్పద హోర్డింగ్‌ ఏర్పాటు చేసిన ఐదుగురిని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అరెస్ట్‌ చేశాం. తెలంగాణలోని సికింద్రబాద్‌కు చెందిన వ్యక్తి, టీఆర్‌ఎస్‌ మద్దతుదారు ఆధ్వర్యంలో ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. జులై 8-9 తేదీల మధ్య రాత్రి బెలి రోడ్డులో దీనిని ఏర్పాటు చేశారు. ఐపీసీలోని 153బీ, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.' అని తెలిపారు. 

ఈ వివాదాస్పద హోర్డింగ్‌ ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్ట్‌ ఇచ్చిన వ్యక్తిని సాయిగా గుర్తించినట్లు చెప్పారు డిప్యూటీ ఎస్పీ అజిత్‌ సింగ్‌. అతడు సికింద్రాబాద్‌కు చెందిన వ‍్యక్తి, టీఆర్‌ఎస్‌ మద్దతుదారు అని తెలిపారు. సాయి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. జులై 7న తెలంగాణలోని సికింద్రాబాద్‌లో సైతం ఇలాంటి పోస్టర్లే వెలిచాయని, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారయన్నారు. టీఆర్‌ఎస్‌ మద్దతుదారు సాయి.. ప్రయాగ్‌రాజ్‌లోని కాంట్రాక్టర్‌కు ఫోన్‌ చేసి హోర్డింగ్‌లు ఏర్పాటు చేసే ప్రాంతాలపై ఆరా తీసినట్లు విచారణలో తేలిందన్నారు అజిత్‌ సింగ్‌. ఆయా ప్రాంతాల వివరాలు ఆర్గనైజర్‌ పంపించగా.. బెలి రోడ్డులో ఏర్పాటు చేయాలని, అందుకు రూ.10వేలు సైతం ఇచ్చినట్లు గుర్తించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సాయి డైహార్డ్‌ ఫ్యాన్‌గా చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: టోల్‌గేట్‌ వద్ద 'ది గ్రేట్‌ ఖలీ' హల్‌చల్‌.. సిబ్బందిపై పంచ్‌లు! 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top