అందరి తెలంగాణగా మార్చడమే లక్ష్యం : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

Bsp Telangana Chief Rs Praveen Kumar Interview With Sakshi Tv

సాక్షి,హైదరాబాద్‌ : కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ చెప్పారు. సాక్షి టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.  దొరల తెలంగాణ కాకుండా పేదల తెలంగాణగా మార్చుదామనేది బీఎస్పీ ఆలోచన అని తెలిపారు. తెలంగాణలో దొరలు వదిలిపెట్టిపోయిన గడీలు గడిచిన తొమ్మిదేళ్లలో మళ్లీ పునర్మిర్మాణమయ్యాయన్నారు. బాంచన్‌ కాల్మొక్త అనే సంస్కృతి తెలంగాణలో పోలేదని చెప్పారు. 

రాజ్యాధికారంతోనే బాంచన్‌ కాల్మొక్త సంస్కృతి పూర్తిగా పోతుందని ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. స్పష్టమైన ప్రణాళికతో అన్ని వర్గాలను కలుపుకుని కృషి చేస్తే రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. ఈ  అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్‌ డిజిట్‌ సీట్లు సాధించి, వీలైతే రాజ్యాధికారం చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో మధుకోడా ఒక్కడే ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ప్రవీణ్‌కుమార్‌ గుర్తుచేశారు.  

దళితులు ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే సరిపోదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటేనే రాజ్యాధికారం వచ్చినట్లవుతుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సీఎం అయిన తర్వాత బహుజనులకు రాజ్యాధికారంవచ్చిందన్నారు. మయావతి హయాంలో దళితులకు భూముల పంపిణీ జరిగిందని, మహిళలకు రక్షణ కల్పించిందని చెప్పారు. మాయావతి పాలన వల్ల బహుజనుల రెండు, మూడు తరాలు బాగుపడ్డాయని తెలిపారు. 

తెలంగాణలో ముఖ్యమంత్రిని కలిసి వారి ఆలోచనలు చెప్పుకునే అవకాశం తెలంగాణలో ఏ బ్యూరోక్రాట్‌కు లేదన్నారు. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ స్థాయి అధికారులు కానిస్టేబుల్‌ ఆపితే ప్రగతిభవన్‌ గేటు వద్ద నుంచే  వెనక్కు వెళ్లిన సందర్భాలున్నాయన్నారు. గురుకులాల సెక్రటరీగా వెళ్లిన వెంటనే దళిత, నిమ్న, వెనుకబడిన, అణగారిన అనే పదాలను నిషేధించి స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చానని తెలిపారు. బీఎస్పీ మేనిఫెస్టోలో పెట్టిన 10 లక్షల ఉద్యోగాలు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని, ప్రభుత్వ,ప్రైవేట్‌ ఉద్యోగాల అన్నీ కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇవేకాక మరిన్ని విషయాలను ప్రవీణ్‌కుమార్‌  సాక్షి టీవీతో పంచుకున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

24-11-2023
Nov 24, 2023, 13:58 IST
కాంగ్రెస్‌ వల్ల 58 ఏళ్లు తెలంగాణ గోసపడింది. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయింది. 
24-11-2023
Nov 24, 2023, 13:08 IST
సాక్షి, జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ అసెం‍బ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో.. గెలుపే...
24-11-2023
Nov 24, 2023, 12:10 IST
తుర్కపల్లి: అవినీతి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను గద్దె దింపాలని కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలంలోని...
24-11-2023
Nov 24, 2023, 11:49 IST
మహబూబ్‌నగర్‌: ఇక్కడి నుంచి కర్ణాటక ఐదు కిలో మీటర్ల దూరమే.. ఎమ్మెల్యే రామన్న నాలుగు బస్సులు ఏర్పాటు చేస్తాడు.. అందరూ...
24-11-2023
Nov 24, 2023, 11:41 IST
ఖమ్మంలో తుమ్మల కోసం కాకుండా పువ్వాడ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న.. 
24-11-2023
Nov 24, 2023, 11:41 IST
శాలిగౌరారం: 80 సంవత్సరాలు పైబడిన వారితో పాటు అంగవైకల్యం కలిగిన వారివద్ద నుంచి ఓట్లను స్వీకరించేందుకు మండలానికి వచ్చిన ఎన్నికల...
24-11-2023
Nov 24, 2023, 10:40 IST
మెదక్‌/తూప్రాన్‌: బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమని, అందుకే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ ముందుకు సాగుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌...
24-11-2023
Nov 24, 2023, 10:34 IST
రాజ్‌నీతి సర్వే సంస్థ తెలంగాణపై తాజాగా తన సర్వే నివేదికను విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) మరోసారి తన...
24-11-2023
Nov 24, 2023, 10:21 IST
సాక్షి,ఆదిలాబాద్‌: బోథ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మార్పు ప్రయోజనమెంతా అనే చర్చ ప్రస్తుతం ఆ పార్టీలో సాగుతోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీల ప్రచారం...
24-11-2023
Nov 24, 2023, 10:18 IST
నిర్మల్‌ ఖిల్లా: ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సమరం కొనసాగుతోంది. మరోవారం రోజుల్లో పోలింగ్‌ ఉండడంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే...
24-11-2023
Nov 24, 2023, 10:16 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ‘రాం రామే.. రాజన్న. ఏం సంగతే. ఇయ్యల్ల పొద్దెక్కుతున్న ఓళ్లస్తలేరు.. సలిగూడ రెండొద్దుల సంది జరంత ఎక్కనే ఉన్నదే....
24-11-2023
Nov 24, 2023, 09:46 IST
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఎల్‌ఓలు ఓటర్‌ చీటీలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ ఓటరు చీటీలు అందకుంటే ఆగం...
24-11-2023
Nov 24, 2023, 09:36 IST
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు.. 
24-11-2023
Nov 24, 2023, 09:33 IST
ప్రధాన పార్టీలేమో వ్యూహాత్మక ఎత్తుగడల నడుమ కీలక నేతల పోరు తెలంగాణ ఎన్నికలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.
24-11-2023
Nov 24, 2023, 09:12 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి అందించే పోస్టల్‌ బ్యాలెట్‌ మిస్సింగ్‌ అవ్వడం ఆదిలాబాద్‌ జిల్లాలో తీవ్ర కలకలం...
24-11-2023
Nov 24, 2023, 09:05 IST
హైదరాబాద్: ఐటీ కంపెనీలకు నిలయంగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 29 రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. టెకీలతో పాటు ఐటీ...
24-11-2023
Nov 24, 2023, 04:45 IST
సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం, పాలమూరు సహా ఇతర ప్రాజెక్టుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర మంత్రి...
24-11-2023
Nov 24, 2023, 04:36 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో హ్యాట్రిక్‌ విజయం లక్ష్యంగా భారత్‌ రాష్ట్ర సమితి సర్వశక్తులూ...
24-11-2023
Nov 24, 2023, 04:29 IST
సాక్షి, పెద్దపల్లి: బీఆర్‌ అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్‌ అని, కాన్షీరాం చనిపోతే కనీసం సంతాపదినం ప్రకటించని...
24-11-2023
Nov 24, 2023, 04:22 IST
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: వందలాది మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ.. కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయిందని... 

Read also in:
Back to Top