దళితబంధు.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు విందు 

BSP President RS Praveen Kumar Comments On BRS Leaders - Sakshi

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌    

జన్నారం (ఖానాపూర్‌): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు విందుగా మారిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. మంగళవారం బీఎస్పీ రాజ్యాధికార యాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నా రం మండలం ధర్మారం, కామన్‌పల్లి, ఇందన్‌పల్లి, జన్నారం గ్రామాల్లో పర్యటించారు.  జన్నారంలో ప్రవీణ్‌ మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకం ప్రకటనకే పరిమితమైందని విమర్శించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులతోపాటు గిరిజనేతరులు కూడా అటవీ హక్కు పత్రాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. టైగర్‌జోన్‌ పేరుతో అడవిలో ఉన్న గిరిజనులు, గిరిజన గ్రామాలను తరలించడం సరికాదన్నారు.  ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సర్పంచ్‌ల ఆత్మహత్యలకు కారణమవుతున్న ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రవీణ్‌ పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు రమేశ్, ఖానాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాథోడ్‌ బన్సీలాల్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top