అలా ప్రచారం చేస్తే.. నడిరోడ్డుపై నిలబెట్టి కొడతా: రేఖా నాయక్‌

BRS MLA Ajmeera Rekha Nayak Strong Warning Johnson Nayak - Sakshi

సాక్షి, నిర్మల్‌ : ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌.. తన పార్టీ తరుపున ఆ నియోజకవర్గ అభ్యర్థి జాన్సన్‌ నాయక్‌కు సాలిడ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. నియోజకవర్గంలో రేఖా నాయక్‌ ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. తాను గెలిచాక చేస్తానని జాన్సన్‌ ప్రచారం చేస్తుండడంపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలు గనుక ప్రచారం చేస్తే.. నడిరోడ్డుపై కొట్టేందుకు కూడా వెనకాడబోనని హెచ్చరించారామె. 

తానింక బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని రేఖా నాయక్‌.. రెబల్‌గా అయినా పోటీ చేసి తీరతానని స్పష్టం చేశారు. ప్రజలు ఇప్పటివరకు రెండు సార్లు ఆశీర్వదించి గెలిపించారని.. చేసిన సేవలు నచ్చితే మూడోసారి రెబల్‌గా కూడా తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారామె. ‘‘రాథోడ్‌ రమేష్‌ నాపై దాడి కోసం వస్తే.. ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు కేవలం అభ్యర్థి అయిన జాన్సన్‌ నాయక్‌ విషయంలో ఏ హోదాతో సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎందుకు ప్రొటోకాల్‌ పాటిస్తున్నారు. ఆయన కేవలం అభ్యర్థి మాత్రమే కదా’’ అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారామె.  

జాన్సన్‌ నాయక్‌కు ఏం తెల్వదు. కేవలం కేటీఆర్‌కు క్లోజ్‌ ఫ్రెండ్‌ అనే టికెట్‌ ఇచ్చారు.  ఈ విషయంలో కేటీఆర్‌ను కలిసినప్పుడు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా.  ఖానాపూర్‌ విషయంలో తనకు టికెట్‌ ఇవ్వనప్పుడు.. స్థానికులకు ఎవరికైనా టికెట్‌ ఇచ్చి ఉంటే బాగుండేది. అలా కాకుండా జాన్సన్‌కు ఇవ్వడం అభ్యంతరకరంగా ఉంది. నేను అభివృద్ధి చేయలేదని ప్రచారం చేస్తే ఊరుకోను.నేను  ఏమి అభివృద్ధి చేశానో ప్రజలకు తెలుసు.  అసెంబ్లీలో కేటీఆర్‌ సమక్షంలోనే.. డిగ్రీ కాలేజ్‌.. రెవెన్యూ డివిజన్‌ అడిగింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారామె. ఈ క్రమంలోనే.. అబద్దాలు ప్రచారంచేస్తే జాన్సన్  నాయక్‌ను  నడిరోడ్డు పై  నిలబెట్టి కొట్టడానికి వెనకాడబోనని హెచ్చరించారామె. న్నారు. 

జాన్సన్‌ను ప్రశ్నిస్తే రౌడీయిజం చేస్తున్నాడని.. ప్రశ్నించినవాళ్లపై దాడులు చేస్తున్నాడని రేఖా నాయక్‌ ఆరోపించారు.  తనకు సెక్యూరిటీని తగ్గించేశారని.. తన అనుచరులనూ బైండోవర్‌లు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు.   ఇప్పుడేం   కాలేదు బిడ్డా.. ఎన్నికలలో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమంటూ జాన్సన్‌ నాయక్‌కు ఉద్దేశించి  రేఖా నాయక్‌ ఘాటు వ్యాఖ్యలే చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

18-09-2023
Sep 18, 2023, 13:44 IST
సాక్షి, కామారెడ్డి: ఏళ్లుగా తమ సమస్యలపై పోరాడుతున్న గల్ఫ్‌ బాధితులు ఈసారి ఎన్నికల గోదాలో నిలవాలని యోచిస్తున్నారు. సర్కారుతో తాడోపేడో...
18-09-2023
Sep 18, 2023, 13:16 IST
వనపర్తి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత పురాతన కట్టడాల్లో చంద్రగఢ్‌ కోట ఒకటి. చుట్టూ రాతితో నిర్మించిన కోట చూడగానే...
18-09-2023
Sep 18, 2023, 12:19 IST
మెదక్‌: నాడు సమైక్య రాష్ట్రంలో బడ్జెట్‌లో నిధులు కేటాయించే వారు లేక ఇబ్బందులు పడ్డామని, రాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్‌...
18-09-2023
Sep 18, 2023, 11:46 IST
సాక్షి, కరీంనగర్‌: మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు సాగాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని పోలీసు...
18-09-2023
Sep 18, 2023, 09:15 IST
మహబూబ్‌నగర్‌: వ్యవసాయ రంగం అభివృద్ధిలో భాగంగా రైతులకు ఉచిత విద్యుత్‌తోపాటు పాలమూరు కరువును శాశ్వతంగా రూపుమాపాలన్న ఉద్దేశంతో రూ.35,200 కోట్లతో...
18-09-2023
Sep 18, 2023, 08:36 IST
సాక్షి, రంగారెడ్డి: తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన విజయభేరి బహిరంగ సభ విజయవంతమైంది. సభాస్థలితో పాటు...
18-09-2023
Sep 18, 2023, 05:20 IST
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 399 రోజుల వరకు హైదరాబాద్‌ స్టేట్‌లో రజాకార్ల అరాచకం సాగింది. వీటి నుంచి విముక్తికి సర్దార్‌...
18-09-2023
Sep 18, 2023, 01:15 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసీఆర్‌ బయటకు వేర్వేరుగా ఉన్నట్లు కనిపించినా, అంతర్గతంగా ఇద్దరూ ఒక్కటే అని ఏఐసీసీ...
18-09-2023
Sep 18, 2023, 01:07 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు బీజేపీ, ఎంఐఎం సహా ఎవరు మద్దతుగా వచ్చినా సరే వంద రోజుల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం...
17-09-2023
Sep 17, 2023, 11:13 IST
నర్సాపూర్‌: నీ కాల్మొక్తా సార్‌.. మా ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వండి... అంటూ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులు మంత్రి హరీశ్‌రావును...
17-09-2023
Sep 17, 2023, 07:20 IST
హైదరాబాద్: అత్యంత కీలక రోజుగా మారిన ‘సెప్టెంబర్‌ 17’ నేపథ్యంలో నగర పోలీసు విభాగం అత్యంత అప్రమత్తమైంది. ఇప్పటికే కాంగ్రెస్‌...
17-09-2023
Sep 17, 2023, 07:00 IST
హైదరాబాద్: ఓవైపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు, భారీ బహిరంగసభ.. మరోవైపు బీజేపీ హైదరాబాద్‌ విమోచన సభ కోసం రెండు...
17-09-2023
Sep 17, 2023, 06:38 IST
హైదరాబాద్: ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్‌ విజయభేరి సభకు...
17-09-2023
Sep 17, 2023, 03:43 IST
సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల రథయాత్రలకు రాష్ట్ర బీజేపీ సమాయత్తమైంది. డిసెంబర్‌లో శాసనసభ ఎన్నికలు...
17-09-2023
Sep 17, 2023, 01:53 IST
సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయాలని...
17-09-2023
Sep 17, 2023, 01:40 IST
‘స్కూల్‌’ ఫీజు కడితే ఎంబీబీఎస్‌ చదువు  రాష్ట్రంలో జిల్లాకో వైద్య కళాశాల కట్టుకుంటున్నాం. నేడు స్కూల్‌ స్థాయిలో ఫీజు కడితే ఎంబీబీఎస్‌...
16-09-2023
Sep 16, 2023, 19:10 IST
మూడున్నర దశాబ్దాల రాజకీయానుభవం. ఖమ్మం రాజకీయాలను చక్రం.. 
16-09-2023
Sep 16, 2023, 14:38 IST
సెప్టెంబర్‌ 17 వచ్చిందంటే రాజకీయ పార్టీలు కొత్త వివాదాన్ని తీసుకొస్తున్నాయి. చరిత్రలో ఇలా జరిగింది.. ఇది మా వాదన అంటూ...
16-09-2023
Sep 16, 2023, 12:38 IST
జన్నారం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్‌ నుంచే తాను బరిలో ఉంటానని ఎమ్మెల్యే రేఖానాయక్‌ స్పష్టం చేశారు. మీ ఆశీస్సులు...
16-09-2023
Sep 16, 2023, 12:10 IST
వేములవాడరూరల్‌: ప్రజల అండతో గెలిచిన తమను కొందరు నాయకులు చిన్నచూపు చూస్తున్నారని, ఇక పార్టీలో ఉండలేమంటూ వేములవాడ రూరల్‌ మండలంలోని...



 

Read also in:
Back to Top