రేవంత్‌ వ్యాఖ్యల దుమారం.. పీడీ యాక్ట్‌ పెట్టాలని బీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదు!

BRS Leaders Filed Police Complaint Against TPCC Revanth Reddy - Sakshi

సాక్షి, వరంగల్‌: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ కొత్త ప్లాన్స్‌తో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ములుగు జిల్లాలోని మేడారం నుంచి రేవంత్‌ పాదయాత్ర ప్రారంభమైంది. కాగా, పాదయాత్రలో భాగంగా రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. 

అయితే, రేవంత్‌ రెడ్డి.. ప్రగతిభవన్‌ను పేల్చేయాలనే వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో రేవంత్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పాదయాత్రను అడ్డుకుంటామని బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు. 

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రపై టెన్షన్‌ నెలకొంది. మరోవైపు.. రేవంత్‌ రెడ్డి మూడోరోజు పాదయాత్ర నేడు మహబూబాబాద్‌లో జిల్లా కొనసాగనుంది. కేసముద్రం మండలం పెనుగొండ  గ్రామంలో జెండా ఆవిష్కరణతో యాత్ర ప్రారంభం కానుంది. కాంగ్రెస్‌ శ్రేణులు తొర్రురు బస్టాండ్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాత్రి పెద్దవంగర వద్ద రేవంత్‌ బస చేయనున్నారు. 

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top