Bodhan Assembly Constituency Political History - Sakshi
Sakshi News home page

బోధన్ నియోజకవర్గం చరిత్ర...ఇదే

Jul 26 2023 5:01 PM | Updated on Nov 7 2023 11:12 AM

Bodhan Assembly Constituency History - Sakshi

బోధన్ నియోజకవర్గం

బోధన్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి షకీల్‌ అహ్మద్‌ మరోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ది, మాజీ మంత్రి సుదర్శనరెడ్డిని 8101 ఓట్ల తేడాతో ఓడిరచారు. షకీల్‌కు 74895 ఓట్లు రాగా, సుదర్శనరెడ్డికి 66794 ఓట్లు వచ్చాయి. కాగా బిజెపి పక్షాన పోటీచేసిన అల్జాపూర్‌ శ్రీనివాస్‌కు ఎనిమిదివేలకు పైగా ఓట్లు వచ్చాయి. అహ్మద్‌ ముస్లిం వర్గానికి చెందినవారు.

నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలకు గాను కేవలం బోధన్ నియోజకవర్గంలోనే 2009లో  సుదర్శన్‌రెడ్డి ఒక్కరే గెలుపొంది మంత్రిగా అవకాశం దక్కించుకుంటే, 2014, 2018లలో  ఆయన కూడా ఓడిపోయారు.  బోధన్లో ఒక ఉప ఎన్నికతో సహా 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐలు కలిసి ఏడుసార్లు గెలిస్తే, టిడిపి నాలుగుసార్లు,టిఆర్‌ఎస్‌ రెండుసార్లు గెలిచాయి. ఇక్కడ గెలిచిన బషీరుద్దీన్‌ బాబూఖాన్‌ ఎన్‌.టి.ఆర్‌ క్యాబినెట్‌లోను, చంద్రబాబు మంత్రివర్గంలోను పనిచేసారు.

అప్పట్లో టిడిపి కేంద్రంలో బిజెపికి మద్దతు ఇచ్చినందుకు నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఆ తరువాత 2004లో కాంగ్రెస్‌ ఐలో చేరిపోయారు. బోధన్ లో 1962లో గెలిచిన రామ్‌గోపాల్‌రెడ్డి కరీంనగర్‌ జిల్లా మేడారం నుంచి కూడా పోటీచేసి గెలుపొంది. బోధన్ స్థానానికి రాజీనామా చేసారు. రామ్‌గోపాల్‌రెడ్డి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైతే, ఇక్కడ ఒకసారి గెలిచిన నారాయణరెడ్డి మరోసారి లోక్‌సభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. బోధన్లో ఆరుసార్లు రెడ్లు, రెండుసార్లు కమ్మ, ఐదుసార్లు ముస్లిం,ఒక్కోక్కసారి బ్రాహ్మణ, వైశ్య,ఇతర వర్గాలవారు ఎన్నికయ్యారు.

బోధన్ గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement