అబిడ్స్ చౌరస్తాకు వస్తావా కేటీఆర్..? : ఈటల సవాల్‌ | BJP MP Etela Rajender Challenges KTR | Sakshi
Sakshi News home page

అబిడ్స్ చౌరస్తాకు వస్తావా కేటీఆర్..? : ఈటల సవాల్‌

Apr 21 2025 4:17 PM | Updated on Apr 21 2025 4:21 PM

BJP MP Etela Rajender Challenges KTR

హైదరాబాద్:  గత పదేళ్లలో తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది.. అదే తెలంగాణకు కేంద్రం చేసింది అనే దానిపై చర్చకు వస్తావా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.  అబిడ్స్ చౌరస్తాలో చర్చ పెట్టుకుందామా కేటీఆర్? అని ఈటల ప్రశ్నించారు.

‘కాంగ్రెస్ నైజం దేశ వ్యాప్తంగా బట్టబయలైంది. మరొకవైపు కార్పోరేట్లరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయొద్దని బీఆర్ఎస్ అప్రజాస్వామిక పిలుపునిచ్చింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలి.  కేంద్ర నిధులతోనే హైదరాబాద్ అభివృద్ధి. మజ్లీస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుటుంబ పార్టీలు.

ముఖ్యమంత్రి గత విదేశీ పర్యటనలోనే లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ కనపడటలేవు. ఉన్న ఉద్యోగాలు ఇక్కడ ఉడిపోతున్నాయి. కేసీఆర్ హయంలోనే మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతకుముందు ఒక ఎమ్మెల్యే ఇంటికి ఇంకో ఎమ్మెల్యే వెళ్ళేవారు. ఇప్పుడు అది లేదు’ అని ఈటల విమర్శించారు..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement