బీహార్‌ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్‌ ప్రమాణం.. డిప్యూటీగా ఆర్జేడీ నేత తేజస్వి

Bihar: Nitish Tejashwi take oath as CM deputy CM - Sakshi

పాట్నా: బీహార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతా దళ్‌(యునైటెడ్‌)కు చెందిన నితీశ్‌ కుమార్‌ ప్రమాణం చేశారు. బుధవారం మధ్యాహ్నాం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సమక్షంలో ఆయన బీహార్‌కు సీఎంగా ఎనిమిదో సారి బాధ్యతలు చేపట్టారు. 

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్‌ బై చెబుతూ.. ఆయన తన రాజీనామాను గవర్నర్‌కు మంగళశారం సాయంత్రం సమర్పించారు. అయితే..  ఆ వెంటనే ఆర్జేడీ సహా విపక్షాల మద్దతుతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎంగా నితీశ్‌ కుమార్‌, తేజస్వి యాదవ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. 

ఈ ప్రమాణ కార్యక్రమానికి బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌ భార్య రాజశ్రీ తదితర ప్రముఖులు, ముఖ్యనేతలు హాజరయ్యారు.  బుధవారం ఈ ఇద్దరు మాత్రమే ప్రమాణం చేయడం విశేషం. మిగతా కేబినెట్‌ కూర్పు తర్వాత ఉండే ఛాన్స్‌ ఉంది.

ఇదీ చదవండి: ఎన్డీయే నుంచి జేడీయూ నిష్క్రమణపై బీజేపీ స్పందన

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top