Bheemili: టీడీపీలో సీట్లకు వేలంపాట.. చంద్రబాబుపై కోరాడ రాజబాబు ఫైర్‌ | Bheemili TDP Leader Korada Rajababu Fire On Ganta Srinivasa Rao, Details Inside - Sakshi
Sakshi News home page

Bheemili: టీడీపీలో సీట్లకు వేలంపాట.. చంద్రబాబుపై కోరాడ రాజబాబు ఫైర్‌

Mar 30 2024 3:43 PM | Updated on Mar 30 2024 5:22 PM

Bheemili Tdp Leader Korada Rajababu Fire On Ganta Srinivasa Rao - Sakshi

సాక్షి, విశాఖపట్నం: గంటా శ్రీనివాసరావుపై భీమిలి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కోరాడ రాజబాబు మండిపడ్డారు. మంత్రిగా అనేక భూ అక్రమాలకు గంటా పాల్పడ్డారని దుయ్యబట్టారు. గంటా ఒక అవినీతిపరుడు. గంటా భూ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయి. జీవీఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ పార్టీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి గంటా. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటాది’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చిన నేతకు భీమిలిలో సీటు ఎలా ఇస్తారు?. నాలుగేళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉన్నారు. డబ్బున్న వారికే చంద్రబాబు టికెట్ల ఇస్తున్నారు. టీడీపీలో సీట్లకు వేలంపాట పెడుతున్నారు. యువతకి 40 శాతం సీట్లు ఇస్తామన్నారు. స్థానిక కాపులకు ఎందుకు సీట్లు ఇవ్వలేదు’’ అని రాజబాబు ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement