
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రం ప్రజాస్వామ్యానికి గ్యాస్ చాంబర్‌గా మారిందంటూ వ్యాఖ్యానించారు. మాట్లాడేందుకు కూడా రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఆజ్‌తక్ చానల్‌తో మాట్లాడారు.
రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి చీఫ్‌గా ఉన్న కోల్‌కతా హైకోర్టు రిటైర్డు జడ్జి ఒకరు రాష్ట్రంలో మానవహక్కుల కమిషన్ ఐసీయూలో ఉందని తనతో అన్నారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు ఆ జడ్జి వ్యాఖ్యలే ఉదాహరణ అని ధన్‌కర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన రాజ్యాంగానికి లోబడి నడవడం లేదన్నారు.