
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను అసెంబ్లీకి ఎందుకు ఆహ్వానించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఎందుకు లేదని నిలదీశారు. బడ్జెట్ అనుమతికి ఇంకా సమయం ఉందన్నారు. కావాలనే గవర్నర్ అనుమతివ్వడంలేదని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
కాగా ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌పై ధ్వజమెత్తారు. బడ్జెట్‌కు ఆమోదం తెలపకుండా గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ బడ్జెట్‌కు ఆమోదం తెలుపని చరిత్ర గతంలో లేదని అన్నారు. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.