నదులకు నడకనేర్పిన కేసీఆర్‌... కాళేశ్వరం మోటార్లకు ఈత నేర్పలేదా?

Bandi Sanjay Fires on CM KCR Over Kaleshwaram Project - Sakshi

అంచనా విలువను పెంచి డబ్బులు దోచుకున్న సీఎం

కేసీఆర్‌కు ఈడీ విచారణ తప్పదు

ప్రజల బాధలు పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ బైక్‌ ర్యాలీ ప్రారంభం

సాక్షి, సిద్దిపేట: ‘నదులకే నడకను నేర్పినట్టుగా సీఎం కేసీఆర్‌ చెప్పుకుంటున్నారు కదా.. వర్షాలకు నీళ్లలో మునిగిన కాళేశ్వరం మోటార్లకు ఈత ఎందుకు నేర్పించలేకపోయారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌తోనే ముంపునకు గురయ్యాయన్నా రు. ఇరిగేషన్‌ ఇంజనీర్‌ అవతారమెత్తి రీడిజైన్‌ పేరు తో రూ.30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్‌  అంచనా వ్యయాన్ని రూ.1.30 లక్షల కోట్లకు పెంచి ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు.

గురు వారం సిద్దిపేట అర్బన్‌ మండలం నాంచార్‌పల్లి నుంచి బీజేపీ చేపట్టిన ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ బైక్‌ ర్యాలీని సంజయ్‌.. బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. ప్రజల బాధలు పోవాలన్నా, అభివృద్ధి జరగాలన్నా బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ‘దేశ్‌ కీ నేత.. దిన్‌ బర్‌ పీతా.. మోదీపే రోతా.. ఫాంహౌస్‌ మే సోతా.. అమాస పున్నానికి ఆతా..’ అంటూ ఎద్దేవా చేశారు.

అడుగడుగునా అవమానించినా అల్లుడికి సిగ్గులే దని, నోటి నిండా అబద్ధాలే వల్లిస్తున్నాడంటూ హరీశ్‌రావుపై మండిపడ్డారు. నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులు కొల్లగొట్టిన వారికి మద్దతుగా ఆందోళనలు చేయ డం సిగ్గుచేటన్నారు. కేసీఆర్‌ ఈడీ విచారణను ఎదు ర్కోక తప్పదని హెచ్చరించారు. రైతులకు రైతుబంధు మాత్రమే ఇచ్చి అన్ని బంద్‌ చేశార న్నారు. తడిసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

కుటుంబపాలనకు చరమగీతం పాడాలి
కేసీఆర్‌ కుటుంబపాలనకు చరమగీతం పాడాలని మురళీధర్‌రావు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, ప్రజలకు అండగా ఉండేందుకే ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.  కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దేవుడినీ మోసం చేసిన ఘనుడు
సిరిసిల్ల/వేములవాడరూరల్‌: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ.వంద కోట్లు ఇస్తానన్న సీఎం కేసీఆర్‌.. ఇవ్వకుండా దేవుడినీ.. వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరి స్తానని అసెంబ్లీలో చెప్పి వీఆర్‌ఏలనూ మోసం చేశారని బండి సంజయ్‌ విమర్శించారు. ప్రజలకు అందుబాటులో లేకుండా వేముల వాడ ఎమ్మెల్యే ఏ దేశంలో తిరుగుతున్నారని,  అతనిపై సీఎం కేసీఆర్‌కు ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. గురువారం సిరిసిల్ల, వేములవాడల్లో పర్యటించారు. వేములవాడలో ‘జనం గోస– బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా బైక్‌ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్రపతిగా బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు నిర్వహించిన సంబరాల్లో బండి సంజయ్‌ డోలు వాయించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top