మాకు కావాల్సింది మాక్‌ పోలింగ్‌ కాదు.. అవసరమైతే సుప్రీంకు వెళ్తా : బాలినేని | Balineni Srinivasa Reddy Comments On EVMs Re Verification, More Details Inside | Sakshi
Sakshi News home page

మాకు కావాల్సింది మాక్‌ పోలింగ్‌ కాదు.. అవసరమైతే సుప్రీంకు వెళ్తా : బాలినేని

Aug 19 2024 5:05 PM | Updated on Aug 19 2024 6:39 PM

Balineni Srinivasa Reddy comments on accAbout EVMs Re Verification

ప్రకాశం,సాక్షి: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల వెరిఫికేషన్ వేళ.. ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో తన రిట్‌ పిటిషన్‌ విచారణ జరుగుతుండగానే... అధికారులు రీ చెక్‌ చేస్తుండడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం.. అభ్యర్ధుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదే. హైర్టులో న్యాయం జరక్కపోతే సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈసీని ఫలితాల్ని రీ వెరిఫికేషన్‌ చేయాలని కోరినట్లు తెలిపారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి. కేవలం మాక్‌ పోలింగ్‌ చేస్తుండడంతో అభ్యంతరం చెప్పామని అన్నారు.  

 ఈవీఎంల్లో అవకతవకలు.. ఈసీకి బాలినేని ఫిర్యాదు
సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని 12 బూత్‌లలో ఈవీఎంల వెరిఫికేషన్, వీవీప్యాట్‌ల లెక్కింపు చేసి.. ఫలితాలతో సరిపోల్చాల్సిందిగా ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు.  ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించేందుకు ఈసీ అధికారులు కేంద్రానికి తరలి వచ్చాయి. 

ఇవాళ రీ చెకింగ్‌ సందర్భంగా ఆయన తరపున ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్‌లు సైతం లెక్కపెట్టాలని ఎన్నికల అధికారుల్ని కోరారు. అయితే.. అలా కుదరదని అధికారులు చెప్పడంతో బాలినేని ప్రతినిధులు బయటకు వచ్చేశారు. దీంతో.. వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement