నేటి సాయంత్రం సీఎం ప్రమాణం.. రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

నేటి సాయంత్రం సీఎం ప్రమాణం.. రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు

Published Mon, Dec 4 2023 12:01 PM

Arrangements For CM Oath Taking At Raj Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాట్లుకు రంగం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం తెలంగాణ రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాణ స్వీకరానికి కావాల్సిన సామ్రాగ్రిని కూడా తరలిస్తున్నారు. 

వివరాల ప్రకారం.. రాజ్‌భవన్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి జీఏడీ ఏర్పాటు చేస్తోంది. రాజ్‌భవన్‌కు సామాగ్రి చేరుకుంటోంది. టెంట్లు, స్టాండ్స్, టేబుల్స్, కుర్చీలు, రెడ్ కార్పెట్లు, ఫర్నిచర్ ఇప్పటికే చేరుకుంది. రాజ్ భవన్‌కు చేరుకున్న లైవ్ కవరేజ్ ఐ అండ్ పీఆర్ మీడియా. గవర్నర్‌ తమిళిసై ఏ క్షణంలోనైనా ఆదేశం ఇచ్చే అవకాశం ఉంది. 

మరోవైపు.. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సీఈవో వికాస్‌రాజ్‌ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల లిస్ట్‌ను గవర్నర్‌కు వికాస్‌రాజ్‌ అందజేయనున్నారు. ఇక, నివేదిక అందాక కొత్త శాసనసభ ఏర్పాటుకు గవర్నర్‌ గెజట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత పొలిటికల్‌ అపాయింట్‌మెంట్స్‌ అని రాజ్‌భవన్‌ వర్గాలు అంటున్నాయి. 

ఇదిలా ఉండగా, ఎల్లా హోటల్‌లో సీఎల్పీ సమావేశం జరిగింది. సీఎల్పీ సమావేశానికి 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక, సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ ప్రతినిధులు, డీకే శివకుమార్‌ హాజరు. సీఎల్పీలో ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. 

 
Advertisement
 
Advertisement