‘సంక్రాంతి మామూళ్ల కోసమే దత్త తండ్రి ఇంటికి దత్త పుత్రుడు’ | AP Ministers Comments On Chandrababu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘సంక్రాంతి మామూళ్ల కోసమే దత్త తండ్రి ఇంటికి దత్త పుత్రుడు’

Jan 8 2023 2:53 PM | Updated on Jan 8 2023 3:34 PM

AP Ministers Comments On Chandrababu And Pawan Kalyan - Sakshi

సంక్రాంతి మామూళ్ల కోసం దత్త తండ్రి ఇంటికి దత్తు పుత్రుడు వెళ్లాడని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు.

సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి మామూళ్ల కోసం దత్త తండ్రి ఇంటికి దత్తు పుత్రుడు వెళ్లాడని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు వేసే ఎంగిలి మెతుకు సీట్లతో మ్యాజిగ్‌ ఫిగర్‌ ఎలా చేరుకుంటారని ప్రశ్నించారు. అమాయకపు జనసేన కార్యకర్తలను పవన్‌ అమ్మకానికి పెట్టాడని అమర్‌నాథ్‌ దుయ్యబట్టారు.

వీరిద్దరూ కలిసిన ఏమి ఒరగదు: స్పీకర్‌ తమ్మినేని
‘‘చంద్రబాబు అయినా పార్టీ మూసేసి పవన్ కల్యాణ్ పార్టీలో కలిపేయాలి, పవన్ కల్యాణ్‌ అయినా తన పార్టీ మూసేసి చంద్రబాబు పార్టీలో కలిసిపోవాలి’’ అని స్పీకర్ తమ్మినేని సీతారాం ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీపై స్పందిస్తూ వీరిద్దరి కలయికను కొట్టిపారేశారు. వీరిద్దరూ కలిసిన ఏమి ఒరగదన్నారు. జనం జగన్ వెంట ఉన్నారని స్పీకర్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement