Breadcrumb
Live Updates
ఆత్మకూరు ఉప ఎన్నిక లెక్కింపు
ఆత్మకూరులో ఫ్యాన్ ప్రభంజనం
ఆత్మకూరు ఉపఎన్నిక: ఫ్యాన్ జోరులో కొట్టుకుపోయిన కమలం
ఆత్మకూరు ఉపఎన్నికలో బీజేపీ ఏ రౌండ్లోనూ వైఎస్సార్సీపీకి పోటీ ఇవ్వలేక చతికిలపడిపోయింది. ఈ ఫలితంతో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పార్టీ వరుస ఓటముల పాలైంది. గతంలో తిరుపతి, బద్వేలు, తాజాగా ఆత్మకూరులో అదే ఫలితం పునరావృతం అయ్యింది. ఈ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 82,888 ఓట్ల మెజారిటీని దక్కించుకున్నారు.
మేకపాటి విక్రమ్‌రెడ్డికి పోలైన ఓట్లు- 102240, (మెజారిటీ -82,888) బీజేపీ అభ్యర్థి భరత్కుమార్కి పోలైన ఓట్లు- 19352 ,
ఆత్మకూరు ఉప ఎన్నిక: వైఎస్సార్సీపీ భారీ విజయం
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 82వేలకు పైగా ఓట్ల మెజారిటీతో అఖండ విజయాన్ని అందుకున్నారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు.
ఆత్మకూరు ఉప ఎన్నిక: డిపాజిట్ కోల్పోయిన బీజేపీ
ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం ఏకపక్షంగా సాగడంతో వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో బీజీపీ డిపాజిట్ కోల్పోయింది.
19వ రౌండ్: 80వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజారిటీ
రౌండ్ రౌండ్‌కి భారీగా ఆధిక్యంతో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. 19 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 80,161 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
18వ రౌండ్: 75 వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజారిటీ
18 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 75,785 ఓట్ల ఆధిక్యం
70 వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజారిటీ
ఆత్మకూరు ఉప ఎన్నికలో రౌండ్ రౌండ్‌కు వైఎస్సార్సీపీ అధిక్యంతో దూసుకుపోతోంది. 17 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 71,887 ఓట్ల అధిక్యం
16 రౌండ్లు కౌంటింగ్ పూర్తి
16 రౌండ్లు పూర్తయ్యేసరికి 66,477 ఓట్ల ఆధిక్యంతో భారీ మెజారిటీ దిశగా వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది.
పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం
పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం లభించింది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 217, అందులో
పోస్టల్ బ్యాలెట్లలో చెల్లిన ఓట్లు- 205. వైఎస్సార్సీపీకి పోలైన ఓట్లు-167
భారీ మెజారిటీ దిశగా వైఎస్సార్సీపీ
ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితం ఏకపక్షంగా సాగుతోంది. 13 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 54,448 ఓట్ల ఆధిక్యం
12వ రౌండ్: 50 వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజారిటీ
12 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 50,654 ఓట్ల ఆధిక్యం
11 రౌండ్లోనూ వైఎస్సార్సీపీ హవా
11 రౌండ్లు పూర్తయేసరికి 46,604 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ
పదో రౌండ్: వైఎస్సార్సీపీ 42 వేల మెజారిటీ
10 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 42, 254 ఓట్ల ఆధిక్యం
8,9 రౌండ్లలోనూ వైఎస్సార్సీపీదే హవా
8 రౌండ్ పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డి 32,892 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, 9 రౌండ్ పూర్తయ్యేసరికి 37,609 ఓట్ల ఆధిక్యంతో భారీ మెజారిటీ దిశగా వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది.
ఏడో రౌండ్లో వైఎస్సార్సీపీ హవా
ఏడో రౌండ్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 28వేలకు పైగా మెజారిటీ
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 31వేలకు పైగా మెజారిటీ సాధించారు.
కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి ప్రతీ రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యం సాధించి భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. కాగా, బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కౌంటింగ్ హాలు నుంచి వెళ్లిపోయారు.
ఐదో రౌండ్: వైఎస్సార్సీపీకి 21 వేలకు పైగా మెజారిటీ
ఐదో రౌండ్ పూర్తయ్య సరికి వైఎస్సార్సీపీకి 21, 241 ఓట్ల మెజారిటీ. ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి ఐదో రౌండ్లోనూ హవా కొనసాగించారు.
17వేలకు పైగా ఆధిక్యంలో విక్రమ్‌రెడ్డి
నాల్గో రౌండ్ పూర్తయ్యే సరికి 17వేలకు పైగా ఆధిక్యంలో మేకపాటి విక్రమ్‌రెడ్డి
ఆత్మకూరు ఉప ఎన్నిక: భారీ మెజారిటీ దిశగా వైఎస్సార్సీపీ
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతుంది. మూడో రౌండ్ పూర్తయ్యే సరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 12, 864 ఓట్ల మెజారిటీ సాధించి భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు.
రెండో రౌండ్: విక్రమ్‌రెడ్డికి 10వేలకు పైగా మెజారిటీ
రెండో రౌండ్ పూర్తయ్యే సరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 10వేలకు పైగా మెజారిటీ. మూడో రౌండ్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్న విక్రమ్‌రెడ్డి.
తొలిరౌండ్లోనే వైఎస్సార్సీపీకి 5వేల ఓట్ల మెజార్టీ
తొలిరౌండ్లోనే వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 5,337వేల ఓట్ల మెజార్టీ లభించింది. మేకపాటి విక్రమ్‌రెడ్డికి 6 వేలకు పైగా ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కు 700 పైచిలుకు ఓట్లు వచ్చాయి.
ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆంధ్రా ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.
పోటీలో 14 మంది అభ్యర్థులు
రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. 14 టేబుళ్ల ద్వారా 20 రౌండ్లలో లెక్కించనున్నారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపుతో ప్రక్రియ మొదలై మధ్యాహ్నానికి ముగియనుంది.
8 గంటల నుంచి ఆత్మకూరు ఉప ఎన్నిక లెక్కింపు
నెల్లూరు: ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితం ఆదివారం వెలువడనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది.
Related News By Category
Related News By Tags
-
ఇళ్ల కూల్చివేత వెనుక లోకేశ్
భవానీపురం (విజయవాడపశ్చిమ): విజయవాడ భవానీపురం జోజినగర్‌లో 42 ప్లాట్లలో ఇళ్ల కూల్చివేత వెనుక మంత్రి లోకేశ్ ఉన్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు సర్కారుకు ఇళ్లు కూల్చివేయడమే తప్ప కట్టిన చ...
-
మా గూడును కూల్చారు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గన్నవరం: ‘‘ఎన్నో ఏళ్లపాటు పైసాపైసా కూడబెట్టి కట్టుకున్న గూడును నేలమట్టం చేసి రోడ్డు పాల్జేశారు. బాబు సర్కారు వచ్చాక మాపై దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభుత్వం చాలా దారు...
-
కొనసాగుతున్న కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు
విజయవాడ: వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన ఘటనపై తాజాగా కేసులు నమోదు కావడం కూటమి సర్కార్ వేధింపులు కొనసాగింపునకు మరొక ఉదాహరణ. అక్టో...
-
కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన: సజ్జల
తాడేపల్లి : ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వస్తుందన్నారు పార్టీ స్టేట్ కో -ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మె...
-
‘అమరావతి.. అంతులేని కథ.. పోలవరం.. ముగింపు లేని కథ’
సాక్షి, తాడేపల్లి: పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని.. దాన్ని బ్యారేజికే పరిమితం చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 41...


