అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సభకు నిరంతరం అంతరాయం కలిగిస్తున్నారనే కారణంగా ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నానని స్పీకర్ ప్రకటించారు. వరుసగా రెండో రోజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సభ నుంచి వెళ్లాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ టీడీపీ సభ్యులు అక్కడే ఉన్నారు. దీంతో మార్షల్స్ వచ్చి వారిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్‌పై దాడి చేశారు. మార్షల్స్‌ని కొట్టిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టపాటి రవి, సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, బాల వీరాంజనేయులు ఉన్నారు. మరోవైపు సస్సెండ్ అయిన సభ్యులతో కలిసి చంద్రబాబు బయటకు వెళ్లారు.
(చదవండి : మీ సంగతి చూస్తా.. స్పీకర్‌కు చంద్రబాబు బెదిరింపు)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి