
బద్వేలు అర్బన్: రాష్ట్ర విభజనకు కారకులై, విభజన హామీలను నెరవేర్చకుండా ప్రస్తుతం రాష్ట్రం ఎ దుర్కొంటున్న అనేక సమస్యలకు కారణమైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా చెప్పారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాయలసీమ ప్రాంతంపైన అవగాహన లేని సోము వీర్రాజు ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివి విమర్శలు చేయడం సరికాదన్నారు. మహానేత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి బ్ర హ్మంసాగర్‌ను పూర్తిచేసి జాతికి అంకితం ఇ వ్వడం వల్లే రైతులకు సాగు, తాగునీరు అం దుతోందని చెప్పారు. 173 చెరువులు నింపిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనన్నారు.