‘మీకు చేతనైతే నన్ను అరెస్ట్‌ చేయండి’.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్‌

Amid Corruption Allegations Mamata Challenge BJP To Arrest Her - Sakshi

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలోని పశ్చిమ బంగాల్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేశాయి. ఈ క్రమంలో మీకు చేతనైతే నన్ను అరెస్ట్‌ చేయండి అంటూ బీజేపీకి సవాల్‌ విసిరారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పశువులు స్మగ్లింగ్‌, స్కూల్‌ జాబ్స్‌ స్కామ్‌ కేసుల్లో టీఎంసీ నేతలు పార్థా ఛటర్జీ, అనుబాత్రా మోండల్‌ అరెస్టుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యల చేశారు. 

కోల్‌కతాలో టీఎంసీ విద్యార్థి విభాగం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు మమతా బెనర్జీ. కోల్‌కతా మేయర్‌, రాష్ట్ర మంత్రి ఫిర్హాద్‌ హకిమ్‌, పార్టీ జనరల్‌ సెక్రెటరీ అభిషేక్‌ బెనర్జీలు సహా తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని విమర్శించారు. ‘ప్రతి ఒక్కరు దొంగలేనని బీజేపీ ముద్ర వేస్తోంది. టీఎంసీలోని వారంతా దొంగలు, కేవలం బీజేపీ, తమ నేతలు మంచి వారుగా కాషాయ పార్టీ ప్రచారం చేస్తోంది. నేను రాజకీయంలో లేకపోయుంటే.. వారి నాలుకలను తెగ్గోసే దానిని. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోంది. అలాగే, అక్రమంగా సాధించిన డబ్బుతో బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోసేందుకు ఉపయోగిస్తోంది. హకిమ్‌ త‍్వరలోనే అరెస్ట్‌ కానున్నారు. కేవలం వేధించేందుకే ఆయనపై తప్పుడు కేసులు పెడుతున్నారు.’ అని పేర్కొన్నారు మమతా బెనర్జీ. 

మహారాష్ట్ర విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు మమత. 2024లో జరిగే సాదారణ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. స్కూల్‌ జాబ్స్‌ కేసులో పార్థా ఛటర్జీని అరెస్ట్‌ చేసినప్పటికీ ఎలాంటి నేరాన్ని నిరూపించలేకపోయారని దుయ్యబట్టారు. 

ఇదీ చదవండి:  కేంద్ర ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపిస్తాం! మమత స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top