గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్‌ | AP Local Body Elections 2026, Ambati Rambabu Alleges Illegal Arrest Of YSRCP Candidate In Dachepalli, Check More Details Inside | Sakshi
Sakshi News home page

గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్‌

Oct 16 2026 10:50 AM | Updated on Oct 16 2026 11:17 AM

Ambati Alleges Conspiracy to Arrest YSRCP Candidate in Dachepalli

సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైందని.. పోలీసులను అడ్డంపెట్టుకుని కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరతీస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అంటున్నారు. దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు.

రవికుమార్‌ అక్రమ అరెస్ట్‌ వ్యవహారంపై శుక్రవారం అంబటి స్పందించారు. రవి పోటీ చేస్తే కూటమికి వచ్చిన భయమేంటని ఆయన నిలదీశారు. ‘‘పోలీసులే మద్యం తీసుకొచ్చి పెట్టి, ఆపైన తనిఖీల పేరిట డ్రామాలాడారు. తెలంగాణ మద్యం అక్రమ నిల్వ అంటూ అరెస్టు చేశారు. ఇలా తప్పుడు కేసులు పెట్టి, అరెస్టులు చేసి ఏకగ్రీవంగా గెలవాలని చూస్తున్నారని అంబటి విమర్శించారు.

తెలంగాణ మద్యం అక్రమంగా ఉందని అరెస్టు చేశారు. రవికుమార్ ఆర్థికంగా స్థితిమంతుడు. పోలీసులే మద్యం తీసుకొచ్చి వాళ్ళే తనిఖీలు చేసి రవికుమార్ ను అరెస్టు చేశారు. ఏంటి ఘోరం... ఇది న్యాయమేనా?. కాపు సామాజిక వర్గానికి చెందిన రవికుమార్ పోటీ చేస్తే మీకెందుకు భయం??. లిక్కర్ అమ్ముకోవాల్సిన ఖర్మ వారికిలేదు.

‘‘రవికుమార్ తండ్రి సాంబయ్య గతంలో ఛైర్మన్‌గా పనిచేశారు. రవికుమార్ ను ఒప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి ఏకగ్రీవం చేసుకోవాలని చూస్తున్నారు. సర్టిఫికెట్లు ఇవ్వరు... అరెస్టులు చేసి గెలవాలని చూస్తున్నారు. దాచేపల్లిలో గెలవలేక అక్రమ మార్గంలో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. రవికుమార్ పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించాలి. పోలీసులు సక్రమంగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నా’’ అని అంబటి అన్నారు.

అలాగే.. అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అంబటి ప్రస్తావించారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండదని పోలీసులకు గుర్తు చేశారు. రక్షించాల్సిన వారే భక్షిస్తున్నారని పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. కృష్ణలంక సాయికృష్ణను ప్రస్తావించిన ఆయన..  ‘రౌడీ’ అంటూ ఓ అమాయకుడ్ని పోలీసులే చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే టార్గెట్‌.. కూటమి పెద్దల కుట్ర!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement