సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్గా అధికారులు పని చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని కూడా అధికారులు లెక్క చేయడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా క్యాస్ట్ సర్టిఫికేట్లు, నో డ్యూస్ సర్టిఫికేట్లు జారీ చేయడం లేదు. నామినేషన్లు ప్రారంభమైనా సర్టిఫికేట్లు జారీ కాకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర బయటపడుతోంది. 24 గంటల్లో సర్టిఫికేట్లన్నీ అందుబాటులోకి వస్తాయన్న ఎస్ఈసీ.. అయితే, ఆయన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు.
కాగా, ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని కోరితే, ఆ వివరాలను నిర్ణీత గడువులోపు అందించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ.. హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఒక వేళ ఎలాంటి కేసులు లేకపోతే, ఆ విషయాన్ని తెలియజేస్తూ ధ్రువీకరణ పత్రం ఇచ్చేలా కూడా ఆదేశాలు జారీ చేయాలని తమ పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించింది.
‘ఏ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.. క్రై మ్ నంబర్ ఎంత వంటి వివరాలతో కూడిన ఒక అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని రెండు రోజుల్లోగా లేదా నిర్ణయించిన గడువులోగా అభ్యర్థికి అందించేలా ఆదేశాలివ్వండి.’ అని వైఎస్సార్సీపీ తన పిటిషన్లో కోర్టును కోరింది. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి గురువారం అభ్యర్థించగా శుక్రవారం వాదనలు వింటామని జస్టిస్ వడ్డిబోయన సుజాత స్పష్టంచేశారు.
ఇదీ చదవండి: సమరానికి ముందే ఉక్కుపాదం


