స్థానిక ఎన్నికలు.. నామినేషన్‌ దాఖలుకు ఏమేమి ఉండాలి? | AP Local Elections candidates Nominations Documents Related Information | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలు.. నామినేషన్‌ దాఖలుకు ఏమేమి ఉండాలి?

Oct 16 2026 7:50 AM | Updated on Oct 16 2026 8:51 AM

AP Local Elections candidates Nominations Documents Related Information

సాక్షి, విజయవాడ: విజయవాడ నగర పాలక సంస్థకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు నగర వ్యాప్తంగా 44 ప్రాంతాల్లో డివిజన్లవారీగా ఆర్వో కేంద్రాలను వీఎంసీ ఏర్పాటు చేసింది. మేయర్‌ అభ్యర్థికి నగరంలోని వీఎంసీ ప్రధాన కార్యాలయం కమాండ్‌ కంట్రోల్‌ రూంను కేటాయించారు. నామినేషన్ల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించింది.  

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలు 2026 కొత్త రూల్స్‌ ప్రకారం  ఇప్పుడు మేయర్‌ను నేరుగాఎన్నుకునే విధానం అమలులో ఉంది. ఈ మేరకు నగర ఓటర్లు మేయర్‌తో పాటు కార్పొరేటర్‌కు కూడా ఓటు వేయాలి.  

మేయర్‌/కార్పొరేటర్‌కు ఉండాల్సిన అర్హతలు..
∙వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి 
∙ఆ మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్‌ లిస్ట్‌లో పేరు ఉండాలి 
∙ముగ్గురు కంటే ఎక్కువ పిల్లలు ఉండకూడదు 
∙మున్సిపాలిటీకి ఏ బకాయి ఉండకూడదు  
నామినేషన్‌కు కావలసిన పత్రాలు – పూర్తి లిస్ట్‌

ఆర్‌వో ఆఫీస్‌లో ఇవ్వాల్సినవి:
∙మేయర్‌ అభ్యరి్థకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఫారం–బి  
∙పార్టీ అ«ధ్యక్షులు తమ అభ్యర్థి అని సంతకం చేసి ఇచ్చే లేఖ (ఫారం–ఏ) 
∙సంబంధిత డివిజన్‌కు అభ్యర్థి తానేనని అధికారిక లేఖ(ఫారం–బి) 
ఇవి నామినేషన్‌ దాఖలుకు చివరి తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటిస్తారు.  

ధ్రువీకరణ పత్రాలు 
∙ఓటర్‌ లిస్ట్‌ సర్టిఫైడ్‌ కాపీ (మీ పేరు + ప్రపోజర్‌ పేరు ఉన్నది) 
∙ఆధార్, పాన్‌ కార్డు 
∙కుల ధ్రువీకరణ పత్రం (రిజర్వేషన్‌ అయితే – తహసీల్దారు ఇచ్చింది) 
∙వయస్సు రుజువు –   పదోతరగతి సర్టిఫికెట్‌  

డిపాజిట్‌ (స్క్రూట్నీ డిపాజిట్‌) 
∙డివిజన్‌ కార్పొరేటర్‌(జనరల్‌ అభ్యర్థులు) రూ.2,500  
∙ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1,250 
∙మేయర్‌ (జనరల్‌) అభ్యర్థులకు రూ.10,000  
∙రిజర్వుడ్‌ అభ్యర్థులు రూ.5 వేలు  
∙ఇది నామినేషన్‌ వేసే ముందే చలానా ద్వారా కట్టాలి, రసీదు జత చేయాలి  

తప్పనిసరి అఫిడవిట్‌-ఫారం–26(2 రకాలు) 
∙నోటరీ/కమిషనర్‌ ముందు ప్రమాణం చేయాలి  
∙ఇందులో ఉండాల్సినవి: ఆస్తులు, అప్పులు, బ్యాంకు లోన్లు, క్రిమినల్‌ కేసులు, విద్యార్హత, పాన్‌కార్డు, పిల్లల సంఖ్య 
∙ఖాళీ కాలమ్‌ వదిలితే నామినేషన్‌ తిరస్కరణ అవుతుంది. నిల్‌ లేదా నాట్‌ అప్లికబుల్‌ అని రాయాలి   
నో డ్యూస్‌ సర్టిఫికెట్‌   
∙మున్సిపాలిటీకి పన్ను బకాయి లేదని కమిషనర్‌ ఇచ్చేది

ఇతరాలు 
∙ప్రపోజర్‌ – అదే వార్డు ఓటరు ఒకరు సంతకం చేయాలి 
∙ఫొటోలు – 3 పాస్‌పోర్ట్‌ సైజు 
∙ప్రమాణం (ఓత్‌) – నామినేషన్‌ తర్వాత స్రూ్కటినీకి ముందు తీసుకోవాలి  

మీకు కావలసినవి డౌన్లోడ్‌ 
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://sec.ap.gov.in//మున్సిపల్‌ఎలక్షన్‌అప్లికేషన్‌ ఫారమ్‌లో అందుబాటులో ఉంటాయి.  

పురపాలక ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుల పరిమితి..
విజయవాడ నగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో మేయర్లు, కార్పొరేటర్ల ఖర్చుల పరిమితిని రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 ప్రకారం పురపాలక చట్టాల నిబంధనల మేరకు గతంలో ఉన్న నోటిఫికేషన్లను సవరిస్తూ కొత్త పరిమితులను నిర్ణయించారు.

వివిధ పదవులకు ఖరారు చేసిన ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితుల వివరాలు 
∙విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌: రూ.25 లక్షలు  
∙డివిజన్‌ కార్పొరేటర్‌కు రూ.10 లక్షలు  

ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ తొలి జాబితా విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement