‘స్థానిక’ ఎన్నికలు.. ప్రారంభమైన కూటమి కుట్రలు | Police Forcibly Took Away Dachepalli Ysrcp Candidate Koppula Ravi | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికలు.. ప్రారంభమైన కూటమి కుట్రలు

Oct 16 2026 10:21 AM | Updated on Oct 16 2026 11:06 AM

Police Forcibly Took Away Dachepalli Ysrcp Candidate Koppula Ravi

సాక్షి, పల్నాడు జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి కుట్రలు ప్రారంభమయ్యాయి. దాచేపల్లి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొప్పుల రవిని తెల్లవారుజామున పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. వైఎస్సార్‌సీపీ తరఫున నగర పంచాయతీకి నామినేషన్ వేయడానికి కొప్పుల రవి సిద్ధమవ్వగా.. రవికుమార్‌ను అక్రమంగా నిర్బంధించారు. మా అపార్ట్‌మెంట్‌లో మద్యం పెట్టి తన కుమారుడిని పోలీసులు తీసుకెళ్లారని తండ్రి సాంబయ్య తెలిపారు.. రవి కుమార్‌ను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారోనని కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.

ఈ క్రమంలో దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.. ఎందుకు రవిని అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొప్పుల రవిని తెల్లవారుజామున పోలీసులు తీసుకొచ్చారు. కార్ పార్కింగ్ ప్లేస్‌లో పోలీసులు మద్యం బాటిళ్లు పెట్టి రవిని అన్యాయంగా పోలీసులు తీసుకువెళ్లారు. నామినేషన్ వేసే అభ్యర్థులకు భద్రత కల్పించాలన్న పిటిషన్ హైకోర్టులో ఇవాళ విచారణకు ఉంది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బెదిరించి భయపెట్టి ఏకగ్రీవాలు చేయాలనుకుంటున్నారు. అక్రమంగా కేసులు పెట్టిన పోలీసులపైన ప్రైవేట్ కేసులు వేస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతాం’’ అని కాసు మహేష్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: సమరానికి ముందే ఉక్కుపాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement