2009 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ | Sakshi
Sakshi News home page

2009 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ

Published Fri, Mar 8 2024 7:15 PM

2009 Andhra Pradesh Caste Equations - Sakshi

2009 ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో మరోసారి కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల కాంగ్రెస్‌ కు బొటాబొటీ మజార్టీనే వచ్చింది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో 156 సీట్లు కాంగ్రెస్‌ కు రాగా, 91 స్థానాలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. ఈ ఎన్నికలలో విభజిత ఆంద్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ పక్షాన 106 మంది గెలిస్తే, తెలుగుదేశం పార్టీ తరపున ఏభై మూడు, మెగాస్టార్‌ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం తరపున పదహారు మంది ఎన్నికయ్యారు.

2009లో రెడ్డి, కమ్మ, కాపుల మధ్య పోటీ
ఇక సామాజికవర్గాల వారీగా చూస‍్తే స్వతంత్ర కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ పై 31 మంది రెడ్లు, ఇరవై మూడు మంది బిసిలు, ఇరవై రెండు మంది ఎస్‌.సిలు, ఏడుగురు కాపులు, నలుగురు కమ్మ, ఆరుగురు ఎస్టి.లు,నలుగురు క్షత్రియ  ముస్లింలు ముగ్గురు,  వైశ్యులు ముగ్గురు, బ్రాహ్నణులు ఇద్దరు గెలిచారు. కాగా తెలుగుదేశం పక్షాన 19 మంది కమ్మ, ఎనిమిది మంది రెడ్లు, పది  మంది బిసిలు, ఏడుగురు ఎస్సిలు, ఒక ఎస్టి, ఇద్దరు కాపు, ముగ్గురు క్షత్రియ, ఒక ముస్లిం, ఇద్దరు వైశ్యులు గెలపొందారు. ప్రజారాజ్యం పక్షాన పది మంది కాపులు, ముగ్గురు రెడ్లు, ఒక కమ్మ, ఇద్దరు వైశ్యులు ఎన్నికయ్యారు. బిసిలలో కాళింగ వర్గం నుంచి ముగ్గురు, పోలినాటి వెలమ ఇద్దరు, కొప్పుల వెలమ ముగ్గురు, తూర్పుకాపు ఐదుగురు, మత్సకార ముగ్గురు, యాదవ నలుగురు, గౌడ ముగ్గురు, శెట్టి బలిజ ఇద్దరు,పద్మశాలి ముగ్గురు, గవర, వడ్డీ కురుమ లకు చెందిన వారు ఒక్కొక్కరు ఎన్నికయ్యారు.
      
42 మంది రెడ్డి ఎమ్మెల్యేల గెలుపు
రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు నలభై రెండు మంది ఎన్నిక కాగా వారిలో ముప్పై ఒక్క మంది కాంగ్రెస్‌ వారే. వీరిలో పద్నాలుగు మంది కోస్తా జిల్లాలకు చెందినవారైతే, మిగిలిన పదిహేడు మంది రాయలసీమకు చెందినవారు. తెలుగుదేశం నుంచి ఎనిమిది మంది ఎన్నిక కాగా, వారిలో ఇద్దరు కోస్తావారు, మిగిలినవారు రాయలసీమ నుంచి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన ముగ్గురులో ఒకరుకోస్తా, ఇద్దరు రాయలసీమ వారు. మొత్తం మీద రాయలసీమ నుంచి ఇరవైఐదు మంది రెడ్లు గెలుపొందగా, ఆంద్ర జిల్లాల నుంచి పదిహేడు మంది గెలిచారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి  హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించారు.ఆ తర్వాత ఆయన సతీమణి విజయమ్మ ఏకగ్రీవంగా గెలుపొందారు. తిరిగి కడప ఎమ్‌.పిగా ఉన్న వారి కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి పదవికి రాజీనామా చేసి వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేసి, తిరిగి పోటీచేసినప్పుడు విజయమ్మ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీచేశారు.ఉప ఎన్నికలలో వీరిద్దరూ ఘన విజయం సాదించారు.  2009 నుంచి జరిగిన రాజకీయ పరిణామాలలో డి.చంద్ర శేఖరరెడ్డి, పి.రామకృష్ణారెడ్డి, శివప్రసాదరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి చంద్ర శేఖరరెడ్డి, ఎ. అమరనాద్‌ రెడ్డి, గడికోట శ్రీకాంతరెడ్డి, చెన్నకేశవరెడ్డి, గురునాదరెడ్డి,  వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌లోకి వచ్చి పదవులు వదులుకొని తిరిగి ఉప ఎన్నికల్లో గెలిచారు. అనర్హతకు గురైనవారిలో పెద్దిరెడ్డి రామచంద్రరరెడ్డి కూడా ఉన్నారు.

కాంగ్రెస్‌ ముఖ్య మంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి  వీరు అనర్హత వేటుకు గురయ్యారు. టిడిపి నుంచి గెలిచినవారిలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, బాలనాగిరెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డిలు టిడిపి నుంచి వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. ప్రసన్నకుమార్‌రెడ్డి పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తిరిగి గెలుపొందారు. కాగా మిగిలిన ఇద్దరు అనర్హత వేటుకు గురైయ్యారు. ప్రజారాజ్యం నుంచి గెలిచినవారిలో శోభానాగిరెడ్డి వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌లో చేరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి గెలిచారు. ప్రజారాజ్యం మరో ఎమ్మెల్యే రామిరెడ్డి కూడా వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లారు.

రెడ్డి సామాజికవర్గ కాంగ్రెస్‌  ఎమ్మెల్యేలు-31

 • ఎన్‌.శేషారెడ్డి- అనపర్తి
 • డి.చంద్రశేఖర రెడ్డి - కాకినాడ సిటి
 • గాదె వెంకటరెడ్డి- బాపట్ల
 • కాసు వెంకట కృష్ణారెడ్డి- నరసరావుపేట
 • వై. వెంకటేశ్వ రరరెడ్డి - సత్తెనపల్లి
 • పి.రామకృష్నారెడ్డి - మాచర్ల
 • శివప్రసాదరెడ్డి- దర్శి
 • బాలినేని శ్రీనివాసరెడ్డి- ఒంగోలు
 • ఎమ్‌.మహీదర్‌ రెడ్డి-కందుకూరు
 • ఉగ్ర నరసింహారెడ్డి-కనిగిరి,
 • ఆనం రామనారాయణరెడ్డి- ఆత్మకూరు,
 • ఆనం వివేకా నందరెడ్డి- నెల్లూరు రూరల్‌,
 • ఆదాల ప్రభాకరరెడ్డి- సర్వేపల్లి,
 • మేకపాటి చంద్ర శేఖరరెడ్డి-ఉదయగిరి,
 • ఎ. అమరనాదరెడ్డి-రాజంపేట,
 • గడికోట శ్రీకాంత రెడ్డి - రాయచోటి,
 • వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి - పులివెందుల,
 • జి.వీరశివారెడ్డి-కమ లాపురం,
 • సి.ఆదినారాయణరెడ్డి- జమ్మలమడుగు,
 • డిఎల్‌. రవీంద్రరెడ్డి - మైదుకూరు,
 • ఇ.ప్రతాపరెడ్డి - శ్రీశైలం,
 • కె.రాంభూపాల్‌ రెడ్డి - పాణ్యం,
 • శిల్పా మోహన్‌ రెడ్డి - నంద్యాల,
 • చెన్నకేశవరెడ్డి - ఎమ్మిగనూరు, 
 • నీరజారెడ్డి - ఆలూరు,
 • జె.సి.దివాకరరెడ్డి - తాడిపత్రి,
 • గురునాదరెడ్డి - అనంతపురం, 
 • కె.వెంకట రామిరెడ్డి - ధర్మవరం,
 • ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి - పీలేరు, 
 • పి.రామచంద్రారెడ్డి - పుంగనూరు,
 • కె.జయచంద్రారెడ్డి - చిత్తూరు.

ఉప ఎన్నికలలో  వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పక్షాన గెలిచినవారు

 • పి.రామకృష్ణారెడ్డి-మాచర్ల
 • బాలినేని శ్రీనివాసరెడ్డి-ఒంగోలు
 • మేకపాటి చంద్ర శేఖరరెడ్డి-ఉదయగిరి
 • ఎ.అమరనాదరెడ్డి-రాజంపేట
 • గడికోట శ్రీకాంతరెడ్డి-రాయ చోటి
 • వైఎస్‌ విజయమ్మ-పులివెందుల
 • చెన్నకేశవరెడ్డి-ఎమ్మిగనూరు
 • గురు నాదరెడ్డి-అనంతపురం.
 • తిరుపతి - భూమన కరుణాకరరెడ్డి (చిరంజీవి రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది)

అనర్హత వేటుకు గురైన వారు

 • డి.చంద్రశేఖరరెడ్డి-కాకినాడ
 • శివప్రసాదరెడ్డి-దర్శి
 • కె.వెంకటరామిరెడ్డి-ధర్మవరం
 • పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి-పుంగనూరు.

తెలుగుదేశం రెడ్డి ఎమ్మెల్యేలు-8

 • కె.నారాయణరెడ్డి- మార్కాపురం
 • ఎన్‌.ప్రసన్నకుమార్‌ రెడ్డి-కోవూరు
 • ఎమ్‌.లింగారెడ్డి-ప్రొద్దుటూరు
 • వై.బాలనాగిరెడ్డి- మంత్రాలయం
 • పి.రఘునాదరెడ్డి-పుట్టపర్తి
 • ఎ.ప్రవీణ్‌ రెడ్డి-తంబళ్లపల్లె
 • బి.గోపాలకృష్ణారెడ్డి- శ్రీకాళహస్తి
 • పి.అమరనాదరెడ్డి- పలమనేరు

ఉప ఎన్నికలు..

 • ప్రసన్నకుమార్‌ రెడ్డి-కోవూరు

అనర్హత వేటుకు గురైనవారు

 • వై.బాలనాగిరెడ్డి - మంత్రాలయం
 • ఎ.ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి - తంభళ్లపల్లి

ప్రజారాజ్యం పార్టీ రెడ్డి ఎమ్మెల్యేలు-3

 • ఎ.శ్రీధర్‌ కృష్ణారెడ్డి- నెల్లూరు సిటీ-పిఆర్పి
 • భూమా శోభ నాగిరెడ్డి- ఆళ్లగడ్డ-పిఆర్పి
 • కె.రామిరెడ్డి- బనగానపల్లె- పిఆర్పి

ఉప ఎన్నిక - భూమా శోభ నాగిరెడ్డి- ఆళ్లగడ్డ

కమ్మ ఎమ్మెల్యేలు-24
2004 లో కాంగ్రెస్‌ పక్షాన 19 మందిఎమ్మెల్యేలు కమ్మ సామాజికవర్గం నుంచి గెలుపొందినా, 2009లో మాత్రం కాంగ్రెస్‌ లో ఆ వర్గం ఎమ్మెల్యేలు బాగా తగ్గిపోయారు.కేవలం నలుగురు మాత్రమే కాంగ్రెస్‌ నుంచి గెలుపొందగా, ఒకరు ప్రజారాజ్యం పక్షాన గెలిచారు. మిగిలిన 19 మంది కమ్మ ఎమ్మెల్యేలు టిడిపి తరపున గెలిచారు.వీరిలో పద్నాలుగు మంది కోస్తా జిల్లాల నుంచి గెలుపొందగా, రాయలసీమలో ఐదుగురుగెలిచారు. టిడిపి ఎమ్మెల్యేలలో ఒకరు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ లోకి వెళ్లారు.ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన అవిశ్వాస తీర్మానం లో  టిడిపి విప్‌ కు విరుద్దంగా ఓటు వేసి అనర్హత వేటుకు గురయ్యారు.ప్రజారాజ్యం తరుపున గెలిచిన యలమంచిలి రవి ఆ పార్టీ విలీనం తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అయ్యారు.

2009 కమ్మ సామాజికవర్గ  టిడిపి  ఎమ్మెల్యేలు-19

 • వి.రామకృష్ణబాబు- విశాఖ తూర్పు
 • వి.జోగేశ్వరరావు- మండపేట
 • పి.వెంకటేష్‌- రాజానగరం- రాజానగరం
 • బి.శేషారావు- నిడదవోలు
 • చింతమనేని ప్రభాకర్‌- దెందులూరు
 • డి.బాలవర్ధనరావు- గన్నవరం
 • కొడాలి నాని-గుడివాడ
 • దేవినేని ఉమామహేశ్వరరావు-మైలవరం
 • కొమ్మాలపాటి శ్రీదర్‌-పెదకూరపాడు
 • ధూళిపాళ్ల నరేంద్ర-పొన్నూరు
 • ప్రత్తిపాటి పుల్లారావు-చిలకలూరిపేట
 • జి.ఆంజనేయులు- వినుకొండ
 • వై.శ్రీనివాసరావు- గురజాల
 • కె.రామకృష్ణ - వెంకటగిరి
 • కె. మీనాక్షి నాయుడు- ఆదోని
 • పి.కేశవ్‌- ఉరవకొండ
 • పరిటాల సునీత- రాప్తాడు
 • గాలి ముద్దు కృష్ణమ నాయుడు- నగరి
 • నారా చంద్రబాబు నాయుడు-కుప్పం.

కాంగ్రెస్‌ కమ్మ ఎమ్మెల్యేలు-4

 • దగ్గుబాటి వెంకటేశ్వరరావు - పర్చూరు-కాంగ్రెస్‌
 • గొట్టిపాటి రవికుమార్‌-అద్దంకి - కాంగ్రెస్‌
 • నాదెండ్ల మనోహర్‌ - తెనాలి-కాంగ్రెస్‌
 • గల్లా అరుణకుమారి - చంద్రగిరి - కాంగ్రెస్‌

2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం ,తెలంగాణ ప్రకటన వంటి అంశాల నేపద్యంలో గొట్టిపాటి రవికుమార్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన అనర్హత వేటుకు గురయ్యారు.

ప్రజారాజ్యం

 • యలమంచిలి రవి - విజయవాడ తూర్పు - పిఆర్పి( ఆ తర్వాత కాలంలో ప్రజారాజ్యం విలీనంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అయ్యారు)

2009 కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలు-19
  ప్రజారాజ్యం స్థాపనతో కాపు సామాజికవర్గం ఆ పార్టీ వైపు మొగ్గు చూపింది. మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ఈ పార్టీకి ఓట్ల పరంగా గణనీయంగా ఓట్లు లభించినా, సీట్లు మాత్రం ఆ స్థాయిలో రాలేదు. కేవలం పద్దెనిమిది నియోజకవర్గాలలో ఉమ్మడి రాష్ట్రంలో గెలుపొందగా, పదహారు  సీట్లను ఎపి, రాయలసీమలలో గెలిచింది. అందులో పది సీట్లు కాపు నేతలే గెలుచుకున్నారు. 2004 లో కాపు సామాజికవర్గం వారు కాంగ్రెస్‌ నుంచి పదహారు మంది గెలవగా, 2009 లో ఏడుగురే గెలిచారు.ఇక తెలుగుదేశం పరిస్థితి మరీ దయనీయం అయింది. కేవలం ఇద్దరే గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ పక్షాన పది మంది విజయం సాదించారు. చిరంజీవి రెండు చోట్ల పోటీచేసి సొంత ప్రాంతమైన పాలకొల్లులో ఓడిపోవడం విశేషం. తిరుపతిలో ఆయన గెలిచారు. ఆ తర్వాత పరిణామాలలో ప్రజారాజ్యం కాంగ్రెస్‌ లో విలీనం అయిపోయింది. దాంతో వీరంతా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అయ్యారు.చిరంజీవి రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికలో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీచేసిన భూమన కరుణాకరరెడ్డి గెలుపొందారు. అవనతి గడ్డ ఎమ్మెల్యే  అంబటి బ్రాహ్మణయ్య అస్వస్థతతో మరణించగా, ఆయన కుమారుడు హరి ప్రసాద్‌ గెలిచారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఆయనకు పోటీ పెట్టలేదు.

ప్రజారాజ్యం పక్షాన గెలిచిన కాపు నేతలు

 • ఎమ్‌. శ్రీనివాసరావు- భీమిలి
 • సిహెచ్‌. వెంకటరామయ్య - గాజువాక
 • గంటా శ్రీనివాసరావు - అనకాపల్లి
 • పి.రమేష్‌ బాబు-పెందుర్తి
 • ఈలి మధు సూదనరావు - టి.పిగూడెం
 • వి.గీత-పిఠాపురం
 • కె.కన్నబాబు - కాకినాడ రూరల్‌
 • పి.గాంధీ మోహన్‌-పెద్దాపురం
 • బి. సత్యానాందరావు- కొత్తపేట
 • కొణిదెల చిరంజీవి- తిరుపతి.

కాంగ్రెస్‌కు చెందిన కాపు ఎమ్మెల్యేలు.. 7

 • తోట నరసింహం- జగ్గంపేట
 • పి.రామాంజనేయులు-భీమవరం
 • వట్టి వసంతకుమార్‌-ఉంగుటూరు- కాంగ్రెస్‌
 • ఎ.కె.శ్రీనివాస్‌- ఏలూరు
 • పేర్ని వెంకట్రామయ్య(నాని) -బందరు
 • కన్నా లక్ష్మీనారాయణ- గుంటూరు పశ్చిమ - కాంగ్రెస్‌
 • ఎ. కృష్ణమోహన్‌ -చీరాల

కాంగ్రెస్‌ రాజకీయ పరిణామాలలో ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని అనర్హత వేటుకు గురయ్యారు.
తెలుగుదేశం పార్టీ కాపు ఎమ్మెల్యేలు-2

 • పి.సత్యనారాయణమూర్తి- ప్రత్తిపాడు
 • అంబటి బ్రాహ్మణయ్య- అవనిగడ్డ.

ఉప ఎన్నిక 

 • అవనిగడ్డ- అంబటి హరి ప్రసాద్‌-టిడిపి

ఉప ఎన్నికలు

 •  రామచంద్రపురం-తోట త్రిమూర్తులు-కాంగ్రెస్‌
 •  నరసాపురం- కొత్తపల్లి సుబ్బరాయుడు-కాంగ్రెస్‌

2009లో ఎన్నికైన బిసి ఎమ్మెల్యేలు-33
 ఈ ఎన్నికలలో ముప్పై మూడు మంది బిసి వర్గాలకు చెందిన వారు శాసనసభకు ఎన్నిక కాగా వారిలో పది మంది టిడిపికి చెందినవారు. మిగిలిన ఇరవై మూడు మంది కాంగ్రెస్‌ నుంచి ఎన్నికయ్యారు. ఇచ్చాపురం, ఎస్‌.కోట, మాడ్గుల, కావలి, డోన్‌ , ప్రత్తికొండ, రాజమండ్రి రూరల్‌, కైకలూరు, పెనుకొండ, కదిరిలలో మాత్రం టిడిపి ఎమ్మెల్యేలు గెలుపొందగా, పలాస, టెక్కలి, శ్రీకాకుళం, ఆముదాలవలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, బీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విశాఖ-ఉత్తరం, విశాఖ-పశ్చిమ, నర్సీపట్నం, రాజమండ్రిసిటి, రామచంద్రాపురం, ముమ్మడివరం, ఆచంట, తణుకు, పెడన, పెనమలూరు, మంగళగిరి, రేపల్లె, రాయదుర్గం, కళ్యాణ్‌ దుర్గంలలో కాంగ్రెస్‌ గెలిచింది.

కాళింగ వర్గం నుంచి ముగ్గురు, పోలినాటి వెలమ ఇద్దరు, కొప్పుల వెలమ ముగ్గురు, తూర్పుకాపు ఐదుగురు, మత్సకార ముగ్గురు, యాదవ నలుగురు, గౌడ ముగ్గురు,శెట్టి బలిజ ఇద్దరు, పద్మశాలి ముగ్గురు, గవర, వడ్డీ, కురుమ, లింగాయత్‌లకు చెందిన వారు ఒక్కొక్కరు ఎన్నికయ్యారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు దర్మాన కృష్ణప్రసాద్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కాపు రామచంద్రరెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌లో చేరి తిరిగి పోటీ చేశారు.అయితే ధర్మాన కృష్ణదాస్‌, కాపు రామచంద్రారెడ్డి తిరిగి గెలుపొందగా, సుభాష్‌ చంద్రబోస్‌ ఓటమి పాలయ్యారు.

కాగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురయ్యారు. టెక్కలి ఎమ్మెల్యే కె.రేవతిపతి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య భారతి కాంగ్రెస్‌ తరుపున ఎన్నికయ్యారు.టిడిపి ఎమ్మెల్యేలలో ఇచ్చాపురం ఎమ్మెల్యే పి.సాయిరాజ్‌ వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌లో చేరి అనర్హత వేటుకు గురయ్యారు.

కాంగ్రెస్‌కు చెందిన బిసి ఎమ్మెల్యేలు.. 23

 • కె.రేవంతిపతి - టెక్కలి-కాళంగ
 • బి.సత్యవతి - ఆముదాలవలస - కాళంగ
 • ధర్మాన ప్రసాదరావు - శ్రీకాకుళం-పొలినాటి వెలమ
 • ధర్మాన కృష్ణదాస్‌ - నరసన్నపేట పొలినాటి  వెలమ
 • ముత్యాలపాప - నర్సీపట్నం - కాంగ్రెస్‌ - కొప్పుల వెలమ,
 • విజయకుమార్‌ - విశాఖ ఉత్తర - కొప్పుల వెలమ,
 • ఎమ్‌. నీలకంఠం - ఎచ్చెర్ల - తూర్పు కాపు
 • బొత్స సత్యనారాయణ-చీపురుపల్లి - తూర్పుకాపు
 • బి.అప్పలనరసయ్య-గజపతినగరం-తూర్పుకాపు
 • బి.అప్పలనాయుడు- నెల్లిమర్ల- కాంగ్రెస్‌- తూర్పుకాపు,
 • ఆర్‌. సూర్యప్రకాశరావు-రాజమండ్రి-కాంగ్రెస్‌- తూర్పుకాపు
 • ఎమ్‌.విజయప్రసాద్‌-విశాఖ పశ్చిమ-కాంగ్రెస్‌-గవర
 • జె.జగన్నాయకులు-పలాస-కాంగ్రెస్‌- మత్సకార
 • సతీష్‌ కుమార్‌- ముమ్మడివరం-కాంగ్రెస్‌- మత్సకార
 • ఎమ్‌.వి.రమణరావు- రేపల్లె- కాంగ్రెస్‌-మత్సకార
 • కె.వి.నాగేశ్వరరావు- తణుకు- కాంగ్రెస్‌-యాదవ,
 • కె.పార్దసారది- పెనమలూరు- కాంగ్రెస్‌-యాదవ
 • ఎన్‌.రఘువీరారెడ్డి- కళ్యాణదుర్గం- కాంగ్రెస్‌- యాదవ
 • జోగి రమేష్‌- పెడన- కాంగ్రెస్‌-గౌడ
 • పి.సుభాష్‌ చంద్రబోస్‌- రామచంద్రాపురం-కాంగ్రెస్‌- శెట్టి బలిజ 
 • పి.సత్యనారాయణ- ఆచంట-కాంగ్రెస్‌- శెట్టి బలిజ
 • కోండ్రు కమల-మంగళగిరి-కాంగ్రెస్‌-పద్మశాలి 
 • కాపు రామచంధ్రారెడ్డి రాయదుర్గం.

ఉప ఎన్నికలు
 టెక్కలి- కె.భారతి`కాంగ్రెస్‌, నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్‌`వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌
రాయదుర్గం`కాపు రామచంధ్రారెడ్డి`వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌.

తెలుగుదేశం పార్టీ పక్షాన ఎన్నికైన బిసి నేతలు-10

 • పి.సాయిరాజ్‌- ఇచ్చాపురం- కాళింగ
 • కె.లలితకుమారి- ఎస్‌.కోట- కొప్పుల వెలమ
 • జి. రామానాయుడు మాడ్గుల కొప్పుల వెలమ
 • జె.వెంకటరమణ-కైకలూరు-వడ్డి
 • బి.మస్తాన్‌ రావు - కావలి- యాదవ
 • కె.ఇ.కృష్ణమూర్తి-డోన్‌ - గౌడ
 • కె.ఇ.ప్రభాకర్‌- పత్తికొండ- గౌడ
 • బి.కె.పార్దసారది-పెనుకొండ - కురుమ
 • చందన రమేష్‌- రాజమండ్రి రూరల్‌ -దేవాంగ
 • వెంకట ప్రసాద్‌-కదిరి-పద్మశాలి.

2009 ఎస్‌.సి సామాజికవర్గం ఎమ్మెల్యేలు
మొత్తం 29 ఎస్‌.రిజర్వుడ్‌ నియోజకవర్గాలు ఉండగా, వాటిలో  కాంగ్రెస్‌ కు ఇరవై రెండు స్థానాలు, తెలుగుదేశం పార్టీకి ఏడు స్థానాలు దక్కాయి.
వారి వివరాలు..

 • పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు
 • ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత
 • రైల్వే కోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు(వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌లో చేరి తిరిగి ఉప ఎన్నికలలో గెలుపొందారు కాగా చింతలపూడి  ఎమ్మెల్యే రాజేష్‌ కుమార్‌ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురయ్యారు. టిడిపి ఎమ్మెల్యేలలో గోపాలపురం ఎమ్మెల్యే వనిత కూడా అనర్హత వేటుకు గురయ్యారు).

కాంగ్రెస్‌  ఎస్‌.సి ఎమ్మెల్యేలు-22

 • కె.మురళీమోహన్‌ - రాజాం
 • ఎస్‌.జయమణి - పార్వతిపురం
 • జి.బాబూరావు - పాయకరావుపేట
 • పి.విశ్వరూప్‌- అమలాపురం
 • ఆర్‌.వరప్రసాదరావు-రాజోలు
 • పి.రాజేశ్వరీదేవీ-పి.గన్నవరం,
 • రాజేష్‌ కుమార్‌-చింతలపూడి
 • డి.పద్మజ్యోతి- తిరువూరు
 • డి.వై.దాస్‌-పామర్రు
 • డి.ఎమ్‌.వరప్రసాద్‌- తాడికొండ
 • ఎమ్‌.సుచరిత-ప్రత్తిపాడు
 • ఎ.సురేష్‌-ఎర్రగొండపాలెం
 • బి.ఎస్‌. విజయకుమార్‌ -సంతనూతలపాడు
 • జి.వి.శేషు- కొండపి
 • కమలమ్మ-బద్వేల్‌
 • కె.శ్రీనివాసులు-ర్వేల్వే కోడూరు
 • ఎల్‌.వెంకటస్వామి-నందికోట్కూరు,
 • మురళీకృష్ణ-కొడుమూరు
 • ఎస్‌.శైలజానాధ్‌-శింగనమల
 • కె.సుధాకర్‌- మడకశిర
 • జి.కుతూహలమ్మ- గంగాధర నెల్లూరు
 • పి.రవి-పూతల్‌ పట్టు.

ఉప ఎన్నికలు..

 • పాయకరావుపేట-జి.బాబూరావు
 • ఎమ్‌.సుచరిత-ప్రత్తిపాడు
 • శ్రీనివాసులు-రైల్వే కోడూరు


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
 
Advertisement
 
Advertisement