ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిరోజూ ఉదయం ప్రార్థనా సమయంలో నీటి పొదుపుపై అవగాహన కల్పిస్తున్నాం. ఎల్నినో ప్రభావంతో భవిష్యత్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలను వివరిస్తున్నాం. పాఠశాలలో నేర్చుకున్న విషయాలను ఇంట్లోనూ పాటించాలని, కుటుంబ సభ్యులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచిస్తున్నాం.
– ఈదులపల్లి నరసింహరావు,
హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, ఆరెంద
పాఠశాలలకు సూచించాం
ఎల్నినో ప్రభావంతో భవిష్యత్లో ఎదురయ్యే వాతావరణ మార్పులు, నీటి కొరతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని పాఠశాలలకు సూచించాం. ప్రతిరోజూ ప్రార్థనా సమయంలో నీటి ప్రాముఖ్యత, పొదుపు, జల వనరుల సంరక్షణ గురించి వివరించేలా చర్యలు తీసుకుంటున్నాం. చిన్నతనం నుంచే నీటి పొదుపు అలవడితే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది. – శారద, జిల్లా విద్యాశాఖాధికారి


