ఉద్యమ తీవ్రత, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. 2009 డిసెంబర్ 9 అర్ధరాత్రి అప్పటి కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. కేసీఆర్ దీక్ష విరమించారు. అయితే సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం కావడంతో డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేసి తన వైఖరిలో మార్పు సంకేతాలిచ్చింది. దీనిపై తెలంగాణలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. డిసెంబర్ 24న తెలంగాణ ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ పరిణామాలన్నీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి.


