బాల్య వివాహాలు వద్దు | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలు వద్దు

Nov 28 2026 1:56 AM | Updated on Nov 28 2026 1:56 AM

పెద్దపల్లిరూరల్‌: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీఒక్కరు సహకరించాలని ప్రత్యేక జడ్జి స్వ ప్నరాణి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ బాల్య ముందస్తు, బలవంతపు వివాహాల ని ర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యా యవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థుల కు సమస్యలు ఎదురైతే భయపడకుండా ఉపాధ్యాయులు, పోలీసులకు లేదా టోల్‌ఫ్రీ 15100, 1098 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. ఈకార్యక్రజుమంలో హెచ్‌ఎం అరుణ, శ్రీనివాస్‌, భానుకృష్ణ, బర్ల రమేశ్‌, తాని నరేశ్‌, శరత్‌ తదితరులు ఉన్నారు.

కుక్కలగూడూరులో ఆర్‌అండ్‌ఆర్‌ గ్రామసభ

పాలకుర్తి: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాలు కుక్కలగూడూరు, వేంనూర్‌లో శుక్రవారం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై గ్రామసభ నిర్వహించారు. కుక్కలగూడూరు నుంచి 244 మంది ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం దరఖాస్తు చేసుకోగా 39మందినే అర్హులుగా గుర్తించారు. వేంనూర్‌ నుంచి దరఖాస్తు చేసుకున్నవారిలో 13 మందినే అర్హులుగా గుర్తించారు. ఈనేపథ్యంలో అధికారులు మరోసారి లబ్థిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. దీంతో కుక్కలగూడూరులో 244 మంది, వేంనూర్‌ నుంచి 419మంది మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్‌ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించారు. ఆ ర్‌ఐ తిరుపతి, సీనియర్‌ అసిస్టెంట్‌ సునీత, జూ నియర్‌ అసిస్టెంట్‌ మల్కారెడ్డి, జీపీవో సుజాత తో కూడిన బృందం ఇంటింటి సర్వే నిర్వహించింది. 1 జనవరి 2015 వరకు 18ఏళ్ల నిండిన యువతకు రూ.2లక్షల చొప్పున ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించనున్నారు. ఈమేరకు లబ్ధిదారుల సర్టిఫికెట్లను పరిశీలించారు. సర్పంచులు మేడం దేవమ్మ, కోల లత పాల్గొన్నారు.

సాధారణ ప్రసవాలపై దృష్టి

పెద్దపల్లి:ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవా ల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యాధికారి పవిత్ర సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీరాములు, ఏటీఈపీ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ సుధాకర్‌రెడ్డి, డీఐవో కిరణ్‌ కుమార్‌, ఇతర అధికారులతో కలిసి శుక్రవారం హెల్త్‌ సబ్‌ సెంటర్ల ఎంఎల్‌హెచ్‌పీలతో వివిధ అంశాలపై సమీక్షించారు. పల్లె దవాఖాన వై ద్యులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

పత్తితీతకు పట్నం కూలీలు

మంథనిరూరల్‌: ఓ వైపు వానాకాలం వరి కోతలు, ధాన్యం విక్రయాలు.. మరోవైపు వరి నా ట్లు, ఉపాధిహామీ పనులు.. ఇలా జోరుగా సాగుతుండడంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో అనేక గ్రామాల్లో పత్తి పంట చేనుల్లోనే తెల్లబోతోంది. తుపాన్‌ ప్రభావంతో ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో రైతులు పట్నం నుంచి కూలీలను రప్పించి పత్తిని సేకరిస్తున్నా రు. మంథని మండలంలోని ఒక్క ఉప్పట్ల గ్రా మంలోనే గోదావరిఖనికి చెందిన సుమారు 150మంది కూలీలు పత్తి తీతకు వస్తున్నారని రైతులు చెబుతున్నారు. గోదావరిఖని నుంచి ఆటోల్లో ఉదయం వచ్చి సాయంత్రం వెళ్తుంటారని, కూలీ డబ్బులతో పాటు ఆటో చార్జీలు తామే చెల్లిస్తున్నామని వివరిస్తున్నారు.

కానిస్టేబుల్‌కు గోల్డ్‌ మెడల్‌

కమాన్‌పూర్‌: రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లోని కానిస్టేబుల్‌ ఎం.రమేశ్‌ ఆర్చరీ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ – 2026 ఆర్చరీ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరి ప్రథమ స్థానంలో నిలిచారు. రమేశ్‌ను పోలీస్‌ అధికారులు శుక్రవారం అభినందించారు.

క్వింటాల్‌ పత్తి రూ.9,022

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.9,022గా ధర పలికిందని జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement