ఉద్యమ మలుపు! | - | Sakshi
Sakshi News home page

ఉద్యమ మలుపు!

Nov 28 2026 1:56 AM | Updated on Nov 28 2026 1:56 AM

కీలక ఘట్టాలు.. 2009 నవంబర్‌ 29న అలుగునూర్‌ చౌరస్తాలో కేసీఆర్‌ అరెస్ట్‌.. ఎగిసిపడ్డ తెలంగాణ

కేసీఆర్‌ ఆమరణ దీక్షతో మలుపు

తిరిగిన తెలంగాణ పోరు

2009 నవంబర్‌ 29న కరీంనగర్‌ వేదికగా కీలక పరిణామం

అల్గునూరు చౌరస్తాలో కేసీఆర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అరెస్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం

డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియపై కేంద్రం ప్రకటన

రేపు అల్గునూరులో దీక్షాదివస్‌ భారీ సభ

బీఆర్‌ఎస్‌ అగ్రనేతల రాక

కీలక ఘట్టాలు..

● నవంబర్‌ 6, 2009: ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు కేసీఆర్‌ ప్రకటన.

● నవంబర్‌ 16: నవంబర్‌ 29న సిద్దిపేటలో దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడి.

● నవంబర్‌ 26: దీక్షకు సిద్ధమవుతూ కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరిక.

● నవంబర్‌ 29: అల్గునూరు వద్ద కేసీఆర్‌ అరెస్ట్‌.. ఖమ్మం జైలులో దీక్ష ప్రారంభం.

● డిసెంబర్‌ 3: ఖమ్మం నుంచి నిమ్స్‌కు తరలింపు.

● డిసెంబర్‌ 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభంపై కేంద్రం ప్రకటన.

● డిసెంబర్‌ 23: కేంద్రం రెండో ప్రకటనతో తెలంగాణలో నిరసనలు.

● డిసెంబర్‌ 24: తెలంగాణ ప్రజాప్రతినిధుల మూకుమ్మడి రాజీనామాలు.

కేసీఆర్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు(ఫైల్‌)

తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు.. కరీంనగర్‌ గడ్డపై రగిలిన పోరాట జ్వాల! ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష.. తెలంగాణ ప్రజల్లో ఉద్యమ కాంక్షను ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసింది. సిద్దిపేటకు వెళ్తున్న కేసీఆర్‌ను అల్గునూరు మలుపు వద్ద పోలీసులు అరెస్ట్‌ చేయడంతో యావత్తు తెలంగాణ అట్టుడికింది. పల్లెపల్లెనా నిరసన జ్వాలలు రగిలాయి.. నగరాలు, పట్టణాలు ఉద్యమ హోరుతో దద్దరిల్లాయి. పార్టీలకతీతంగా ప్రజలంతా ఒక్కటై సాగించిన పోరాటం కేంద్రాన్ని కదిలించింది. చివరకు 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించక తప్పలేదు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఆ ఉద్యమ ఘట్టానికి 17 ఏళ్లు పూర్తవుతున్న వేళ.. అలనాటి పోరాట స్ఫూర్తిని మరోసారి గుర్తుచేసుకుంటూ రేపు (ఆదివారం) అల్గునూరులో ‘దీక్షా దివస్‌’కు బీఆర్‌ఎస్‌ సమాయత్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement