ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Nov 19 2026 12:01 AM | Updated on Nov 19 2026 12:01 AM

● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీ సుకెళ్లాలని, ఇదేసమయంలో కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూ చించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆ ధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవా రం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 29న కరీంనగర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే విషయంలో పోలీసులు, ఇతర ఒత్తిళ్లకు కార్యకర్తలు భయపడవద్దని ఆయన సూచించారు.

సైకిల్‌యాత్ర బృందానికి సన్మానం

కాళేశ్వరం ప్రాజెక్టు పరిరక్షణ, సాగునీటి ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు 400 కిలోమీటర్ల మేర సైకిల్‌యాత్ర చేపట్టిన బృందాన్ని ఈశ్వర్‌ సన్మానించారు. యాత్రకు నాయకత్వం వహించిన బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్‌తోపాటు నాయకులు కాశిపాక వాసు, ఆరెపల్లి సురేశ్‌ను శాలువాలతో సత్కరించారు. 29న అల్గునూరులో చేపట్టే దీక్షా దివస్‌ సభ సన్నాహాల్లో భాగంగా నాయకులతో సమావేశం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement