అగ్రిగోల్డ్ కుంభకోణం న్యాయ ప్రక్రియలో భాగంగా ఏపీ సీఐడీ అధికా రులు కరీంనగర్‌కు వచ్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,563 మంది బాధితులు ఉన్నట్లు అంచనా. బాధితులు తమ పెట్టుబడులకు సంబంధించిన బాండ్లు, రశీదులు, డాక్యుమెంట్లతో పాటు గుర్తింపు కార్డులు తీసుకుని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే సహాయ కేంద్రానికి రావాలి. బాధితులు మరణించి ఉంటే వారి వారసులు సరైన గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు ఏపీ పోలీసులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నాం. – గౌస్ ఆలం, సీపీ, కరీంనగర్


