బూడిద లారీల నుంచి రూ.6 కోట్ల వసూలు | - | Sakshi
Sakshi News home page

బూడిద లారీల నుంచి రూ.6 కోట్ల వసూలు

Nov 19 2026 12:01 AM | Updated on Nov 19 2026 12:01 AM

పెద్దపల్లి: ఎన్టీపీసీ నుంచి ఉచితంగా సరఫరా చేసే బూడిదను తరలించే లారీల నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే ఒక్కోట్రిప్పుకు రూ.500 చొప్పు న వసూలు చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మె ల్యే కోరుకంటి చందర్‌ ఆరోపించారు. మూడేళ్లలో సుమారు రూ.6 కోట్ల వరకు వసూలు చేశారని, ఆ లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చట్టబద్ధమైన ఉత్తర్వు లు లేకుండా పన్నులు, రుసుములు వసూలు చేయడానికి వీల్లేదన్నారు. ఏ అధికారంతో లారీల నుంచి వసూలు చేస్తున్నారని, ఆ డబ్బులు ఎవరి ఖాతాలో కి వెళ్లాయో కలెక్టర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మట్టి తరలింపులోనూ నిబంధనలు అతిక్రమించి రూ.3,500 వరకు వసూలు చేస్తున్నార ని ఆరోపించారు. వసూలు చేసిన నిధులను తిరిగి చెల్లించాలని, లేనిపక్షంలో డీపీటీవో, సీబీఐ, సెంట్ర ల్‌ విజిలెన్స్‌ కమిషన్‌, ఈడీకి ఫిర్యాదు చేస్తామని, కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రతి నిధులు పల్లె అశోక్‌, ముత్యం అనిల్‌ గౌడ్‌, రాము గౌడ్‌, ఉప్పు రాజ్‌కుమార్‌, మారుతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement