పెద్దపల్లి: హెచ్‌ఐవీ నియంత్రణలో జిల్లా సురక్షి త్ హోదాను దక్కించుకుంది. బుధవారం కలెక్టరేట్‌కు వచ్చిన రాష్ట్ర అధికారి రాజేశంకు కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) నిర్వహిస్తున్న సమ్మాన్ సమారోహ్ వి డుదల చేసిన జాతీయ స్కోర్‌కార్డులో 2023 డి సెంబర్‌లో 32వ స్థానంలో ఉన్న మనరాష్ట్రం.. గత ఆర్థిక సంవత్సరంలో 13వ స్థానానికి, ప్ర స్తుతం రెండోస్థానానికి చేరుకోవడం విశేషం. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 20 జిల్లాలు హెచ్‌ఐవీ నియంత్రణలో నిర్దేశించిన 9,59,595 లక్ష్యాల ను సాధించి సురక్షిత్ హోదా పొందాయి. ఇందులో మనజిల్లా కూడా ఉండటం విశేషం.
రోడ్ల అభివృద్ధికి నిధులు
పెద్దపల్లి: జిల్లాలోని గిరిజన ఆవాస ప్రాంతాల్లో మూడు బీటీ రోడ్ల విస్తరణ, పటిష్టతకు ప్రభు త్వం రూ.13.20 కోట్లతో పరిపాలనా అనుమ తులు మంజూరు చేసిందని ప్రభుత్వ విప్ వి జయరమణారావు తెలిపారు. ఇందులో ఓదెల మండలం నాంసానిపల్లి– లంబాడితండా వర కు 3.50 కి.మీ. బీటీ రోడ్డు విస్తరణ, పటిష్టతకు రూ.6.30 కోట్లు, పెద్దపల్లి – ధర్మారం – గోపా యిపల్లి మధ్య 1.60 కి.మీ. రోడ్డు అభివృద్ధికి రూ.2 కోట్లు, కాల్వశ్రీరాంపూర్ – చిన్నరాతిప ల్లి మధ్య 3.60 కి.మీ. రోడ్డుకు రూ.4.90 కోట్లు కేటాయించారని ప్రభుత్వ విప్ వివరించారు.
డ్రగ్స్ నియంత్రణపై నిఘా
మంథని: గంజాయి, మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలు, వినియోగంపై నిరంతర నిఘా ఏ ర్పాటు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ ఆదేశించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేశారు. 5 ఎస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చే యాల్నారు. 40 ఏళ్ల వయసు పైబడిన పోలీసు సిబ్బంది ప్రతీ ఆరు నెలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఇప్పటినుంచే దృష్టి సారించాలని తెలిపారు. పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, మంథని ఎస్‌ఐ సందీప్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
చెస్ పోటీలు ప్రారంభం
పెద్దపల్లి: స్థానిక జీనియస్ చెస్ అకాడమీలో బు ధవారం జిల్లాస్థాయి చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. అండర్–14, 17 బాలబాలికల వి భాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఎస్జీఎఫ్ జి ల్లా కార్యదర్శి కనకుంట్ల లక్ష్మణ్ మాట్లాడుతూ, చదరందంతో ఏకాగ్రత పెరుగుతుందన్నారు. పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొ మురోజు శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తులా శోభారాణి, సురేందర్, వర్కింగ్ ప్రెసి డెంట్ దాసరి రమేశ్, జీనియస్ అకాడమీ డైరెక్టర్ అనూప్, చెస్ అసోసియేషన్ ప్రతినిధులు, పీడీలు, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
స్కూల్‌ను కూలగొడతారా?
మంథని: మంచి స్కూల్‌ను కూలగొట్టించి గెస్ట్‌హౌస్ నిర్మించేందుకు యత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. కూచిరాజ్‌పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బుధవా రం సందర్శించి బడి స్థితిగతులపై హెచ్‌ఎంను అడిగి తెలుసుకున్నారు. ఎంఈవోతో ఫోన్‌లో మాట్లాడారు. స్కూల్‌ను కూలగొడితే.. కొత్తది ఎక్కడ నిర్మిస్తారని, నిధులు ఎన్ని మంజూర య్యాయనే విసయం ఎవరికీ తెలియదన్నారు. నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, ఆరెపల్లి కు మార్, కనవేన శ్రీనివాస్, మిర్యాల ప్రసాద్‌రా వు, మాచిడి రాజూగౌడ్, వేము లక్ష్మయ్య, యాకూబ్, పెగడ శ్రీనివాస్ పాల్గొన్నారు.
పుస్తక పఠనం అవసరం
పెద్దపల్లిరూరల్: పుస్తక, పత్రిక పఠనం అలవ ర్చుకోవాలని డీఈవో శారద సూచించారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవా రం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సిబ్బంది యూనుస్‌ఖాద్రీ, క విత, భారతి, స్వరూప, సదానందం ఉన్నారు.


