పారదర్శక సేవలతోనే సింగరేణి అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

పారదర్శక సేవలతోనే సింగరేణి అభివృద్ధి

Nov 8 2026 12:25 AM | Updated on Nov 8 2026 12:25 AM

పారదర్శక సేవలతోనే సింగరేణి అభివృద్ధి ● ఆర్జీవన్‌ జీఎం లలిత్‌కుమార్‌ ● సీఐటీయూఅధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

● ఆర్జీవన్‌ జీఎం లలిత్‌కుమార్‌

గోదావరిఖని: పారదర్శక సేవలతో సింగరేణి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆర్జీ–వన్‌ జీఎం లలిత్‌కుమార్‌ అన్నారు. జీఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రామగుండం రీజియన్‌లోని ఆర్జీ–వన్‌, టూ, త్రీ, ఏపీఏ, భూపాలపల్లి ఏరియాల అధికారులు హాజరయ్యారు. గెస్ట్‌ఫాకల్టీ కిశోర్‌బగాడియా వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అవినీతి, లంచగొండితనం వ్యవస్థలను ఎలా భ్రష్టు పట్టిస్తున్నాయో వివరించారు. అభివృద్ధికి ఆటంకంగా నిలిచే అవినీతి నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అవగాహన కల్పించారు. అధికారులు మల్లయ్య, కె.చంద్రశేఖర్‌, కాశి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

‘బకాయిల సాధన కోసం ప్రజాభవన్‌ ముట్టడిస్తాం’

గోదావరిఖని: సింగరేణికి రావాల్సిన బకాయిల సాధనకు ప్రజాభవన్‌ ముట్టడిస్తామని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. ఓసీపీ–1పై శనివారం ఏర్పాటు చేసిన గేట్‌ మీటింగ్‌లో మాట్లాడారు. కార్మికుల హక్కులకు భంగం కలగకుండా ఐక్యంగా పోరాడాలని కోరారు. సొంతింటి పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఇందుకోసం సీఐటీయూ నిరంతరం పోరాడుతుందని అన్నారు. నాయకులు కుంట ప్రవీణ్‌కుమార్‌, పర్స వినేశ్‌, విజయకుమార్‌, భూమయ్య, రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

గోదావరిఖని: ఇంటి నుంచే భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, గనిలో పనిచేసేటప్పుడు రక్షణచర్యలు చేపట్టాలని సిమ్‌టార్స్‌ ఏజీఎం విజయ్‌కుమార్‌ సూచించారు. సిమ్‌టార్స్‌లో భద్రతపై శనివారం అవగాహన కల్పించారు. విధి నిర్వహణలో హెల్మెట్‌ ధరించాలని, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అన్నారు. కార్యక్రమంలో స్టాట్యూటరీ మేనేజర్‌ రమేశ్‌బాబు, మేనేజర్‌ శివయ్య, బ్రాంచ్‌ సెక్రటరీ శ్రీను, పిట్‌ ఇంజనీర్‌ మల్లేశ్‌, సేఫ్టీ ఆఫీసర్‌ సల్మాన్‌ఖాన్‌, పిట్‌ సెక్రటరీ పొన్నాల వెంకటయ్య, వెంటిలేషన్‌ ఆఫీసర్‌ కుమారస్వామి, సంక్షేమాధికారి గణేశ్‌ పాల్గొన్నారు.

హెచ్‌ఎంఎస్‌, ఏఐటీయూసీ నాయకుల బాహాబాహీ

గోదావరిఖని: ఆర్జీ–వన్‌ ఏరియా వర్క్‌షాప్‌లో శనివారం ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌ నాయకుల మ ధ్య చోటుచూసుకున్న ఘర్షణ, వాగ్వాదం దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. కార్మికుల సమస్యలపై మాట్లాడానికి వర్క్‌షాప్‌ అధికారుల వద్దకు రెండు యూనియన్ల నాయకులు వెళ్లారు. ఈక్రమంలో ఇ రువర్గాల మధ్య మాటామాటా పెరిగి కొట్టుకున్నారు. ఈవిషయం చర్చనీయాంశంగా మారింది. హెచ్‌ఎంఎస్‌ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement