కోరుట్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు రుణపడి ఉంటానని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. హైదరాబాద్లోని మైత్రీవనంలో శనివారం బా ధ్యతలు స్వీకరించారు. జిల్లా రాజకీయాల్లో తన తండ్రి జువ్వాడి సేవలు చిరస్మరణీయమని, ఆయన వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన తనకు సీఎం రేవంత్రెడ్డి తగిన గుర్తింపునిచ్చారని తెలిపారు. పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన గుర్తింపు దక్కుతుందన్నారు. పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తానన్నారు. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. తన ప్రమాణ స్వీకారానికి భారీగా తరలివచ్చి న పార్టీ శ్రేణులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపా రు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్, జువ్వాడి కృష్ణారావు, జువ్వాడి చంద్రశేఖర్ రావు, కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్లు తిరుమల వసంత, మైలారపు లింబాద్రి, వివిద మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు.


