మంథనిరూరల్: తెలంగాణ తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు మాతృవియోగం జరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాజులపల్లిలో శుక్రవారం సాయంత్రం అల్లం నారాయణ మాతృమూర్తి అల్లం బుచ్చమ్మ తుది శ్వాస విడిచారు. శనివారం ఆమె అంత్యక్రియలు జరిగాయి. పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, జర్నలిస్టులు తరలివచ్చి బుచ్చమ్మ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బుచ్చమ్మ కుమారులు అల్లం నారాయణ, అల్లం వీరయ్య, అల్లం రాజయ్యను పరామర్శించారు. మంథని, రామగుండం మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధూకర్, కోరుకంటి చందర్ తదితరులు హాజరయ్యారు.
దొంగ దొరికాడు
జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో శనివా రం తెల్లవారుజామున జరిగిన ఆస్తి సంబంధిత నేరాన్ని సీసీఎస్ ఎస్సై జీవన్, సిబ్బంది ఛేదించారు. శుక్రవారం రాత్రి కృష్ణానగర్‌లోని రఫిక్ ఖాన్ ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీఎస్ ఎస్సై, పోలీసు బృందం రంగంలోకి దిగింది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా అనుమానితుడిని గుర్తించింది. రూ.95,500 నగదు స్వాధీనం చేసుకుంది. సాంకేతిక ఆధారాలతో గోదావరిఖని రమేశ్‌నగర్‌కు చెందిన ఈత వెంకటేశ్ నిందితుడిగా గుర్తించి విచారించారు. తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల నిమిత్తం ఎన్టీపీసీ పోలీసులకు అప్పగించారు. జీవన్ గతంలో ఎన్టీపీసీలోనే విధులు నిర్వర్తించడంతో ఈ ప్రాంతంపై పట్టుంది. తనదైన శైలిలో నిందితుడిని పట్టుకునేందుకు ఇదే దోహదపడింది. చోరీ జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు అప్పగించిన సీసీఎస్ ఎౖస్సై జీవన్‌తోపాటు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఈమేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు రామగుండం సీఐ కృష్ణకుమార్ తెలిపారు.


