గోదావరిఖని: లేబర్ కోర్టు ఎదుట ఉన్న పైలాన్‌ను ఏకపక్షంగా తొలగించడం దుర్మార్గమని మాజీ ఎ మ్మెల్యే కోరుకంటి చందర్ దుయ్యబట్టారు. బుధవా రం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో రామగుండం ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, ప్రజ ల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పైలాన్‌ను కక్షపూరితంగా కూల్చివేశారన్నారు. ప్రజావసరాల కో సం రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన అభివృద్ధి పను ల గుర్తులను తొలగిస్తే భవిష్యత్ తరాలకు అభివృద్ధి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. తాము శాంతియుతంగా నిరసన తెలిపినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. కౌశిక హరి, మేకల సమ్మయ్య పాల్గొన్నారు.


