పెద్దపల్లిరూరల్: పత్తి తూకం వేసే సమయంలో మార్కెట్ యార్డులో అకస్మాత్తుగా వర్షం కురిసింది. దీంతో యార్డుకు వచ్చిన 1,460 క్వింటాళ్ల పత్తి తూకం వే యడం సాధ్యకాకపో వచ్చని వ్యాపారులు చెప్పడం.. గురువారం కొనుగోళ్లు జరగవని అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. పత్తిని తూకం వేయాల్సిందేనని రైతులు పట్టుబట్టారు. అవసరమైతే తడిసిన పత్తిని ఒక కిలో కటింగ్ చేసినా అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో కొందరు రైతులు నిరసనకు దిగేందుకు యత్నించగా సమాచారం అందుకున్న టౌన్ ఎస్సై రాజశేఖర్ అక్కడకు చేరుకుని జిల్లా మార్కెటింగ్ అధికారి సమక్షంలో తూకం వేయించేలా ఒప్పించారు. దీంతో సమస్య సద్దుమణిగింది. బుధవారం రాత్రి దాకా పత్తి తూకం కొనసాగింది.


