రైతు కంట కన్నీరు | - | Sakshi
Sakshi News home page

రైతు కంట కన్నీరు

Nov 4 2026 11:52 PM | Updated on Nov 4 2026 11:52 PM

పెద్దపల్లి/పాలకుర్తి: అకాల వర్షంతో పొలాలు చిత్తడిగా మారుతున్నాయి. వరికోతలు చేపట్టే పరిస్థితి లేదు. దీంతో మరో ఐదు రోజుల పాటు వ రి కోతలకు విరామం తప్పదని భావిస్తున్నారు. సాధారణంగా హార్వెస్టర్ల తో కోతలు చేపట్టాల్సి ఉండగా, వా టి కొరతతో చైన్‌ మిషన్లను వినియో గించాల్సి వస్తోంది. దీంతో కోతల ఖ ర్చు పెరిగి ఆర్థిక భారం పడుతోందని అంటున్నారు. ఇప్పుడు వర్షం తోడవడంతో పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు.

తడిసిన ధాన్యం

పాలకుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. ప్రస్తుతం వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొందరు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి ఆరబోశారు. కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించకపోవడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈనేపథ్యంలో కురిసిన వర్షంతో ధాన్యం తడిసి ముద్దయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement