గోదావరిఖనిటౌన్: మణుగూరు ఆర్టీసీ డిపో కండక్టర్ ప్రవళిక మృతికి నిరసనగా స్థానిక డిపో ఎదుట బుధవారం ఈయూ, టీఎంయూ, ఎన్‌ఎంయూ జేఏసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు. కండక్టర్ మృతికి సంతాపం తెలిపారు. సాయంత్రం కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. నా యకులు మాట్లాడుతూ, ప్రవళిక మృతికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తేవాలని, కఠిన చట్టాలు తీసుకు రావాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబు, ఈదురు వెంకన్న, థామస్‌రెడ్డి, మౌలానా తదితరులు పాల్గొన్నారు.


